Share News

Viral: ఈ టీచర్ మరణించిన మూడేళ్ల తరువాత మళ్లీ అదే ఫొటో వైరల్.. కారణం ఏంటంటే..

ABN , Publish Date - Jan 14 , 2024 | 09:45 PM

ఆ టీచర్ కన్నుమూసి మూడేళ్లకు పైగానే అవుతోంది. అయితే, మరణానికి ఒక్క రోజు ముందు తీసిన ఆయన ఫొటో నెట్టింట మరోసారి వైరల్‌‌గా మారింది. మరణ శయ్యపై ఉండి కూడా తన తండ్రి టీచర్‌ బాధ్యతలు మర్చిపోని వైనాన్ని ఆయన కూతురు నెట్టింట చెప్పుకొచ్చింది.

Viral: ఈ టీచర్ మరణించిన మూడేళ్ల తరువాత మళ్లీ అదే ఫొటో వైరల్.. కారణం ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఆ టీచర్ కన్నుమూసి మూడేళ్లు దాటింది. అయితే, మరణానికి ఒక్క రోజు ముందు తీసిన ఆయన ఫొటో నెట్టింట మరోసారి వైరల్‌‌గా మారింది. మరణ శయ్యపై ఉండి కూడా తన తండ్రి టీచర్‌ బాధ్యతలు మర్చిపోని వైనాన్ని ఆయన కూతురు నెట్టింట చెప్పుకొచ్చింది. నాటి ఫొటో వెనకున్న కథ తెలుసుకున్న అనేక మంది ఆయనను మరోసారి పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. తమ జీవితాన్ని మలుపు తిప్పిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకున్నారు.

2020లో శాండ్రా వెనెగస్ అనే మహిళ తన తండ్రి చివరి ఫొటోను నెట్టింట పంచుకుంది. ఆ ఫొటోలో పెద్దాయన తన విద్యార్థుల పేపర్ దిద్దుతూ ( Teacher spends final hours Grading Students) కనిపించారు. ఫొటో తీసిన మరుసటి రోజే ఆయన ఈ లోకాన్ని వీడారు. ఆసుపత్రికి వెళుతున్న సమయంలో ఆయన తన వెంట లాప్‌టాప్ చార్జర్ తీసుకెళ్లారు. అక్కడ ఆయన పరీక్ష పేపర్లను దిద్దారు. నాటి ఫొటో మరోసారి నెట్టింట వైరల్‌ (Viral) కావడంతో ఆ టీచర్‌పై ప్రస్తుతం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఫొటోపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ప్రస్తుత సమాజంలో టీచర్లకు తగినంత గౌరవం దక్కడం లేదని కొందరు వాపోయారు. టీచర్ల నిస్వార్థ సేవకు గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్లకు తగినంత వేతనాలు దక్కకపోవడాన్ని కూడా కొందరు ప్రస్తావించారు. అనేక మంది తమ జీవితాల్ని మలుపు తిప్పిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకున్నారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య ఈ టీచర్ ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది.

Updated Date - Jan 14 , 2024 | 09:51 PM