Share News

Breakup Day: ప్రేమను అంగీకరించేందుకే కాదు.. తిరస్కరించేందుకూ ఓ రోజుంది.. !

ABN , Publish Date - Feb 15 , 2024 | 03:25 PM

ప్రేమించిన వ్యక్తితో గడిపిన అద్భుతమైన క్షణాలను తలుచుకునే రోజు. ప్రేమికుల మధుర జ్ఞాపకాలను ప్రత్యేకంగా ఈ రోజున తలుచుకుంటారు.

Breakup Day: ప్రేమను అంగీకరించేందుకే కాదు.. తిరస్కరించేందుకూ ఓ రోజుంది.. !
Breakup

ప్రేమను ప్రేమిస్తున్న వ్యక్తికి తెలిపేందుకు ప్రేమికులంతా ఎదురుచూసే పండుగ వాలెంటైన్స్ డే వీక్ ఇలా ఉన్నాయి. ప్రేమించిన వారు ఎక్కడ ఉన్నా కూడా తమ ప్రేమను ప్రేమగా తెలుపుతారు. అలాంటి ప్రేమికుల రోజు తర్వత రోజు నుంచి ఏం మొదలవుతుందో తెలుసా.. ప్రేమలో ఉండి విరక్తి చెందో, లేక ఇబ్బంది పడో లేదా మరే కారణం చేతనో విడిపోవాలనుకునే వారి కోసం యాంటీ వాలెంటైన్ వీక్ మొదలవుతుంది. దీనికోసం విడిపోవాలనుకునే జంటలు వారం పాటు తమ విముఖతను రకరకాలుగా తెలియజేయవచ్చు. ఈ వారం రోజులు విశేషాలు ఏంటంటే..

వాలెంటైన్స్ డే వీక్ ఫిబ్రవరి 14వ తేదీ వరకూ జరిగింది. ఈ రోజున ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు ప్రేమికులంతా.. ఆ తర్వాతి రోజు అంటే ఫిబ్రవరి 15 నుంచి యాంటీ వాలెంటైన్ వీక్ మొదలవుతుంది. అసలు విషాదానికి కూడా ఏంటీ తతంగం అనుకుంటున్నారా..

స్లాప్ డే (ఫిబ్రవరి 15)

గట్టిగా చెంప దెబ్బతో మొదలయ్యే యాంటీ వాలెంటైన్స్ వీక్ మొదలయ్యేది స్లాప్ డే తో మొదలవుతుంది. ప్రేమలో మోసాన్ని భరించలేని వారు, హృదయానికి అయిన గాయాన్ని ఎక్స్ లవర్ కు చెలిపే విధానంంలో గట్టిగా చెంప మీద కొట్టి చెబుతారు. నిజానికి ఇలాగే చెప్పలనే రూల్ కూడా ఏం లేదు. కెరియర్లో సాగిపోతూనే తమ ఎక్స్ లవర్ ని గుర్తుచేసుకునేవారూ ఉంటారు.

కిక్ డే (ఫిబ్రవరి 16)

యాంటీ-వాలెంటైన్స్ వీక్‌‌లో రెండో రోజు కిక్ డే. ఇదేదో బాక్సింగ్ చేసినట్టు ప్రేమికుల్ని కొట్టుకు చావమని కాదు. జీవితంలో ఎదుర్కొంటున్న, లేదంటే ఎదుర్కొనే ప్రతికూల అంశాలను తీసి వేయాలని చెప్పే ఉద్దేశ్యమే కిక్ డే.

పెర్ఫ్యూమ్ డే (ఫిబ్రవరి 17)

యాంటీ-వాలెంటైన్స్ వీక్‌‌లో మూడో రోజు పెర్ఫ్యూమ్ డే. సువాసనలు వెదజల్లే పెర్య్ఫూమ్ లా జీవితంలో స్వచ్ఛతతో, సువాసనతో వ్యక్తులు మెలగాలని, మనసును నిర్మలంగా ఉంచుకోవాలని తెలిపే ఈ రోజు ప్రేమికులకు మరో ప్రత్యేకమైన రోజు.

ఫ్లర్టింగ్ డే (ఫిబ్రవరి 18)

యాంటీ-వాలెంటైన్స్ వీక్‌‌లో నాలుగో రోజు ఫ్లర్టింగ్ డే. ఫ్లర్టింగ్ డే అంటే వేరే అర్థంలో తీసుకుని శృంగారం గురించని కాదు. ప్రేమలో ప్రేమికులు గతంలో గడిపిన మధురమైన క్షణాలను గుర్తు తెచ్చుకోవడం కోసం మాత్రమే.

కన్ఫెషన్ డే (ఫిబ్రవరి 19)

యాంటీ వాలెంటైన్ వీక్‌లో ఐదో రోజున కన్ఫెషన్ డే. ప్రేమలో ఉన్నప్పటి వరకు ఆ రిలేషన్‌షిప్‌లో పడిన కష్టాలను ఈరోజున పూర్తిగా మరిచిపోవాలి. తప్పులను ఒప్పుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని తెలిపే రోజు.

మిస్సింగ్ డే (ఫిబ్రవరి 20)

యాంటీ వాలెంటైన్ వీక్‌లో ఆరో రోజును మిస్సింగ్ డే. ప్రేమించిన వ్యక్తితో గడిపిన అద్భుతమైన క్షణాలను తలుచుకునే రోజు. ప్రేమికుల మధుర జ్ఞాపకాలను ప్రత్యేకంగా ఈ రోజున తలుచుకుంటారు.

బ్రేకప్ డే (ఫిబ్రవరి 21)

యాంటీ-వాలెంటైన్స్ వీక్‌లో చివరి రోజు బ్రేకప్ డే. ప్రేమించిన వ్యక్తితో ప్రేమను వద్దనుకునే సందర్భం. మోసాలు, అబద్దాలపై ఏర్పడిన ప్రేమకు బ్రేక్ వేసే సమయం. నచ్చని వ్యక్తితో జీవితాన్ని కొనసాగించడం కంటే మధ్యలోనే విడిపోవడం నయం అనుకునే సందర్భం. ఇలా ప్రేమను చెప్పడానికి, ప్రేమను వద్దనుకోడానికి కూడా పాత్యాశ్చ సంస్కృతిలో ఎన్ని రోజులున్నాయో. ఇది మన పద్దతి కాకపోయిన యువత దీని వైపుగానే అడుగులు వేస్తుంది. మంచికో చెడుకో ఈ పద్దలన్నీ మనలో భాగం అయిపోతున్నాయి.

Updated Date - Feb 15 , 2024 | 03:25 PM