Share News

Neuralink Chip: మొట్టమొదటిసారిగా ఒక మనిషి మెదడులో చిప్ అమరిక.. ఎందుకంటే..?

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:35 PM

మానవ మెదడు, కంప్యూటర్‌ల మధ్య ప్రత్యక్ష కమ్యూనికేషన్‌ను ఏర్పరచడమే లక్ష్యంగా ఎలాన్ మస్క్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ‘న్యూరాలింక్ స్టార్టప్’ కీలక ముందడుగు వేసింది. మొట్టమొదటిసారి ఒక మనిషి మెదడులో న్యూరాలింక్ చిప్‌ను విజయవంతంగా అమర్చింది.

Neuralink Chip: మొట్టమొదటిసారిగా ఒక మనిషి మెదడులో చిప్ అమరిక.. ఎందుకంటే..?

మానవ మెదడు, కంప్యూటర్‌ల మధ్య ప్రత్యక్ష కమ్యూనికేషన్‌ను ఏర్పరచడమే లక్ష్యంగా ఎలాన్ మస్క్ సహ -వ్యవస్థాపకుడిగా ఉన్న ‘న్యూరాలింక్’ కంపెనీ పరిశోధనలో కీలక ముందడుగు వేసింది. మొట్టమొదటిసారి ఒక మనిషి మెదడులో న్యూరాలింక్ చిప్‌ను విజయవంతంగా అమర్చింది. మొదటిసారి ఓ పేషెంట్ మెదడులో దీనిని అమర్చినట్టు ‘ఎక్స్’ వేదికగా ఎలాన్ మస్క్ ప్రకటించారు. పేషెంట్ కోలుకుంటున్నాడని, ప్రారంభంలో చక్కటి పురోగతి కనిపిస్తోందని ఆయన తెలిపారు. మంచి ఫలితాలు అందుకోవడం ఖాయంగా కనిపిస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

కాగా మస్క్ సహ-స్థాపకుడిగా ‘న్యూరోటెక్నాలజీ’ సంస్థను 2016లో ఏర్పాటు చేశారు. మెదడు, కంప్యూటర్‌ల మధ్య ప్రత్యక్ష కమ్యూనికేషన్ మార్గాలను రూపొందించడమే లక్ష్యంగా ఉంది. మానవ సామర్థ్యాలను పునరుత్తేజం చేయడం, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత వ్యాదులకు మెరుగైన చికిత్స అందించాలనేవి లక్ష్యాలుగా ఉన్నాయి. ఇక భవిష్యత్‌లో మనుషలు, కృత్రిమ మేధస్సు మధ్య సహజీవన సంబంధాన్ని ఏర్పరచడం కూడా ఒక ముఖ్యమైన టార్గెట్‌గా ఉంది. మనిషి మెదడులో చిప్ పెట్టి ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి గతేడాదే యూఎస్ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది. దీంతో ఇన్వాయిస్ ఆపరేషన్ ద్వారా పెషెంట్ మెదడులో చిప్‌ని అమర్చారు. 5 నాణేల పరిమాణం ఉండే ఈ చిప్ ‘లింక్’ సాంకేతికత ప్రధాన ఆధారంగా పనిచేస్తుంది.

Updated Date - Jan 30 , 2024 | 12:39 PM