Share News

Viral video: కొత్త టెక్నిక్.. ఒకే చెట్టుకు బంగాళదుంపలు, టమాటాలు కాసిన వైనం.. షాక్‌లో నెటిజన్లు!

ABN , Publish Date - Feb 13 , 2024 | 05:54 PM

ఒకే చెట్టుకు టమాటాలు, బంగాళదుంపలు పండేలా చేసిన ఓ కొత్త టెక్నిక్ చూసి నెటిజన్లు భయపడిపోతున్నారు.

Viral video: కొత్త టెక్నిక్.. ఒకే చెట్టుకు బంగాళదుంపలు, టమాటాలు కాసిన వైనం.. షాక్‌లో నెటిజన్లు!

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో వ్యవసాయానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఎంతో మందికి ఇదే జీవనాధారం. ఇక దేశప్రజల ఆకలి తీరుస్తున్న రైతుకు చేతులెత్తిమొక్కినా తక్కువే. అయితే, ప్రస్తుత జనాభా దృష్ట్యా వ్యవసాయంలో ఉత్పాదకత ఇంకా పెరగాలని నిపుణుల చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నెట్టింట్లో ప్రస్తుతం వైరల్‌ అవుతున్న ఓ వీడియో పెద్ద చర్చకే దారి తీసింది. ఒకే మొక్కకు అటు టమాటాలు..ఇటు బంగాళదుంపలు కాసేలా చేసిన టెక్నిక్‌ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు (Farmers New Technique Of Growing Potatoes And Tomatoes On One Plant).

Viral: చిన్న కిటుకుతో గూగుల్‌లో జాబ్ కొట్టేసిన యువతి.. ఇలా చేస్తే ఎవరికైనా కోరుకున్న ఉద్యోగం పక్కా.


వ్యవసాయం గురించి అవగాహన ఉన్న వారెవరికైనా అంటుకట్టడం గురించి తెలిసే ఉంటుంది. ఇంగ్లిష్‌లో దీన్ని గ్రాఫ్టింగ్ అంటారు. ఈ టెక్నిక్‌ సాయంతో కొందరు ఒకే మొక్కకు అటు టమాటాలు, ఇటు బంగాళదుంపలూ కాసేలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలోని వ్యక్తి ఈ టెక్నిక్ గురించి వివరించాడు. దీన్ని పొమాటో అంటారని చెప్పాడు. దీంతో, రైతుల ఆదాయం రెట్టింపవుతుందని చెప్పాడు.

ViralVideo: భారత్ పరువు ఎందుకు తీస్తున్నావ్?..లండన్‌లో యువతి చేసిన పనికి తిట్టిపోస్తున్న నెటిజన్లు!


అయితే, ఈ ప్రయోగాన్ని చాలా మంది మెచ్చుకున్నప్పటికీ కొందరు మాత్రం పెదవి విరిచారు. ప్రకృతితో పరాచకాలు వద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో, నెట్టింట ఈ ఉదంతం పెద్ద చర్చకే దారి తీసింది. అంటుకట్టడం ఎప్పటి నుంచో ఉన్నదేనని, దీన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదని కొందరు చెప్పారు. ఇలాంటి ప్రయోగాలతోనే దిగుబడులు పెరిగి రైతు ఆనందంగా ఉంటాడని చెప్పుకొచ్చారు. మరి ఈ వింత వీడియోను మీరూ ఓ మారు చూడండి.

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి!

Updated Date - Feb 13 , 2024 | 06:01 PM