Share News

Creosote Bush : వర్షాన్ని గుర్తు చేసే గుబురు పొద గురించిన అద్భుతాలు ఎన్నో.. !!

ABN , Publish Date - Feb 22 , 2024 | 12:04 PM

ఈ క్రియోసోట్ 14 రకాల అనారోగ్యాలను నయం చేస్తుందని నమ్ముతారు. అందులో ముఖ్యంగా జలుబు, ఛాతి ఇన్ఫెక్షన్లు, ఊపిరితిత్తుల రద్దీ, ప్రేగులలో అసౌకర్యం, కడుపులో నొప్పి, క్యాన్సర్, వికారం, గాయాలు, విషాలకు విరుగుడు, చుండ్రు, శరీర దుర్వాసన ఇలాంటి ఎన్నో రోగాలకు చికిత్సగా ఉపయోగిస్తారు.

Creosote Bush : వర్షాన్ని గుర్తు చేసే గుబురు పొద గురించిన అద్భుతాలు ఎన్నో.. !!
creosote Bush

నైరుతి మెక్సికోలోని వాండ్ వెల్లర్ ప్రాంతంలో విరివిగా కనిపించే పొదలు క్రియోసోట్ పొదలు.. వీటిని స్పానిష్ భాషలో గోబెర్నాడోరా, హెడియోండిల్లా అంటారు. ఈ మొక్క నూనె, కలప, జిగురు ఇలా అన్నీ ప్రత్యేకమైన గుణాలు కలిగి ఉంటాయి. అందుకే మెక్సికన్లు ఈ గుబురును హెడియోండిల్లా అని పిలుస్తారు. అంటే సువాసనను ఇచ్చేది అని అర్థం. అంటే ఈ గుబురు మొక్క వర్షం పడినప్పుడు వచ్చే మట్టి వాసన వస్తుంది. ఈ మొక్క దాని ఆకులపై పూత నుండి సుపరిచితమైన ముస్కీ, మట్టి వాసనను విడుదల చేస్తుంది.

ఈ క్రియోసోట్ 14 రకాల అనారోగ్యాలను నయం చేస్తుందని నమ్ముతారు. అందులో ముఖ్యంగా జలుబు, ఛాతి ఇన్ఫెక్షన్లు, ఊపిరితిత్తుల రద్దీ, ప్రేగులలో అసౌకర్యం, కడుపులో నొప్పి, క్యాన్సర్, వికారం, గాయాలు, విషాలకు విరుగుడు, చుండ్రు, శరీర దుర్వాసన ఇలాంటి ఎన్నో రోగాలకు చికిత్సగా ఉపయోగిస్తారు.

క్రియోసోట్ తో అమెరికన్లు పచ్చబొట్లను వేసుకుంటారు. ఈ గుబురు పొద బూడిదను పచ్చబొట్టు వేసేందుకు ఉపయోగిస్తారు. కలర్ బేస్ గా దీనిని వాడతారు.

ఇది కూడా చదవండి: రక్తహీనతను తగ్గించే కాయధాన్యాలను రోజూ తీసుకుంటే..!

ఈ క్రియోసోట్ పొదలు తమను తాము క్లోన్ చేయగలవు. సాధారణంగా ఒక బుష్ లోపలి కాండం చనిపోగానే బయటి నుంచి మళ్ళీ కొత్త కొమ్మలు పుట్టుకొస్తాయి. ఇవి కాలిఫోర్నియాలోని మోహవే ఎడారిలో 11,700 సంవత్సరాల వయస్సున్నవిగా అంచనా వేయబడ్డాయి.

1. క్రియోసోట్ బుష్ రెండు సంవత్సరాలు నీరు లేకుండా ఉంటుంది. 200 సంవత్సరాల వరకు జీవించగలదు.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి..

2. ఎడారి జంతువులు, కీటకాలు దీన్ని ఇష్టపడతాయి. జాక్రాబిట్స్ అప్పుడప్పుడు క్రియోసోట్ ఆకులను తింటాయి, డజన్ల కొద్దీ కీటకాలు బుష్‌కి ఆకర్షితమవుతాయి.

3. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. కొంతమంది స్థానిక ప్రజలు జలుబు, గాయాలు, చర్మ వ్యాధులకు చికిత్స చేయడానికి దీనిని ఉపయోగిస్తారు.

Updated Date - Feb 22 , 2024 | 12:04 PM