Share News

Viral: అమ్మో.. ఈ ఆటో ఎక్కితే కష్టమే.. జేబులో డబ్బులు లేకపోతే.. ఓ మహిళ చేసిన పోస్ట్‌పై నెటిజన్ల ఆగ్రహం.!

ABN , Publish Date - Apr 05 , 2024 | 10:05 AM

డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ వచ్చాక మన దేశంలో చెల్లింపుల వ్యవహారమే మారిపోయింది. ఇంతకుముందులా జేబుల్లో డబ్బులు పెట్టుకోవడం, ఏటీఎమ్‌ల ముందు క్యూలు కట్టడం వంటివి లేవు.

Viral: అమ్మో.. ఈ ఆటో ఎక్కితే కష్టమే.. జేబులో డబ్బులు లేకపోతే.. ఓ మహిళ చేసిన పోస్ట్‌పై నెటిజన్ల ఆగ్రహం.!

డిజిటల్ పేమెంట్స్ (Digital Payments) సిస్టమ్ వచ్చాక మన దేశంలో చెల్లింపుల వ్యవహారమే మారిపోయింది. ఇంతకుముందులా జేబుల్లో డబ్బులు పెట్టుకోవడం, ఏటీఎమ్‌ల ముందు క్యూలు కట్టడం వంటివి లేవు. చిన్న కిరాణ కొట్టు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అందరూ యూపీఐ ట్రాన్సాక్షన్స్‌ను (UPI Payments) అనుమతిస్తున్నారు. దీంతో పేమెంట్స్ చేయడం సులభతరం అయింది. అయితే చెన్నై (Chennai)లో ఇటీవల ఆటో (Auto) ఎక్కిన ఓ మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది (Viral News).

చెన్నైకు చెందిన సువేత గుణశేఖరన్ అనే మహిళ ఓ యాప్ ద్వారా ఆటో బుక్ చేసుకుని తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆ ఆటో డ్రైవర్ డిజిటల్ పేమెంట్‌ను అంగీకరించలేదు. ``గూగుల్ పే అందుబాటులో లేదు. ఏటీఎమ్ నుంచి డబ్బులు తీసుకోవడానికి ఆటో ఆగదు" అని రాసి ఉన్న నోటీసును ఆటో ముందు అతికించాడు. దీంతో ఆమె డబ్బులు చెల్లించడానికి చాలా ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది. ``ఇలాంటి వారిని కలుసుకోవడం చాలా ఆనందం`` అంటూ గుణశేఖరన్ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2.3 లక్షల మందికి పైగా ఈ ట్వీట్‌ను వీక్షించారు. 7.5 వేల మందికి పైగా ఈ ట్వీట్‌ను లైక్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ ఆటోలో నేను కూడా ప్రయణించా. అతడు చాలా కఠినంగా మాట్లాడతాడు`` అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ``ఆ బోర్డును ఆటో లోపల కాకుండా బయట అతికించాలి`` అంటూ మరొకరు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

Anand Mahindra: ఏం ట్యాలెంట్ బాస్.. డ్రైవర్ లేకుండా ప్రయాణించిన బొలేరో.. ఆనంద్ మహీంద్రా ఫిదా!


Viral: బ్రిటన్ ప్యాలస్‌లోని బంగారు టాయిలెట్ చోరీ.. దాని విలువ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Updated Date - Apr 05 , 2024 | 10:05 AM