Share News

Rs500 Notes: స్టార్ గుర్తు ఉన్న రూ.500 నోట్లు మీ దగ్గరా ఉన్నాయా?.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

ABN , Publish Date - Jan 12 , 2024 | 09:30 PM

సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఫేక్ న్యూస్ బెడద ఎక్కువై పోయింది. వాస్తవాలకు విరుద్ధంగా జరుగుతున్న ఎన్నో ప్రచారాలు జనాలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇటీవల ఇలాంటిదే ఒక ప్రచారం జరిగింది. అదేంటంటే నక్షత్రం (*) గుర్తు ఉన్న రూ.500 నోట్లు నకిలీవని దేశంలోని పలు చోట్ల జోరుగా ప్రచారం జరిగింది.

Rs500 Notes: స్టార్ గుర్తు ఉన్న రూ.500 నోట్లు మీ దగ్గరా ఉన్నాయా?.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఫేక్ న్యూస్ బెడద ఎక్కువై పోయింది. వాస్తవాలకు విరుద్ధంగా జరుగుతున్న ఎన్నో ప్రచారాలు జనాలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇటీవల ఇలాంటిదే ఒక ప్రచారం జరిగింది. అదేంటంటే నక్షత్రం (*) గుర్తు ఉన్న రూ.500 నోట్లు నకిలీవని దేశంలోని పలు చోట్ల జోరుగా ప్రచారం జరిగింది. ఈ మేరకు వాట్సప్ సహా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ వార్త తెగ చక్కర్లు కొట్టింది. ఇంకేముందీ చాలా మంది బ్యాంకులకు వెళ్లి మరీ ఈ నోట్లు తిరిగిచ్చేస్తున్నారని ప్రచారం చేశారు. ఈ ప్రచారమంతా నిజమేనేమో అని నమ్మేట్టుగా ఎక్స్ వేదికగా కూడా విస్తృత ప్రచారం జరిగింది. ‘ స్టార్ గుర్తు ఉన్న రూ.500 నోట్లు మార్కెట్‌లో చెలామణి అవుతున్నాయి. ఇలాంటి నోటు ఒకటి నా దగ్గరకు కూడా వచ్చింది. అది నకిలీ నోటు. ఈ రోజు నా స్నేహితుడు వద్దకు ఓ కస్టమర్ నుంచి ఇలాంటివి 2-3 నోట్లు వచ్చాయి. శ్రద్ధగా పరిశీలించి వాటిని వెనక్కి తిరిగిచ్చేశాడు’’ అని పేర్కొన్నాడు.

అయితే ఈ ప్రచారమంతా నకిలీదేనని తేలింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం నక్షత్రం (*) గుర్తు ఉన్న నోటుని ఒక నోటు స్థానంలో మరో దాన్ని ముద్రించారని లేదా పున:ముద్రించారని అర్థంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ పీఐబీ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. డిసెంబర్ 2016 నుంచి స్టార్ గుర్తు ఉన్న రూ.500 నోట్లు చెలామణిలో ఉన్నాయని తెలిపింది. 2016 నాటి ఆర్‌బీఐ సర్క్యూలర్‌ను కూడా జోడించింది. ట్వీట్ ద్వారా ఈ క్లారిటీ ఇచ్చింది. దీంతో స్టార్ గుర్తు ఉన్న నోట్లు నిజమైనవేనని నిర్ధారణ అయ్యింది.

Updated Date - Jan 12 , 2024 | 09:31 PM