Share News

Anand Mahindra: నా పేరులో కూడా ``మహీ`` ఉన్నందుకు గర్వపడుతున్నా.. ధోనీపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు!

ABN , Publish Date - Apr 15 , 2024 | 04:04 PM

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర తన వ్యాపార కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇతర విషయాలకు కూడా తగినంత సమయం కేటాయిస్తారు. సినిమాలు, క్రికెట్‌ను విపరీతంగా ఇష్టపడతారు. తనకు నచ్చిన వాటి గురించి సోషల్ మీడియా ద్వారా ఇతరులతో పంచుకుంటారు.

Anand Mahindra: నా పేరులో కూడా ``మహీ`` ఉన్నందుకు గర్వపడుతున్నా.. ధోనీపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు!
ఆనంద్ మహీంద్రా, ధోనీ

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన వ్యాపార కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇతర విషయాలకు కూడా తగినంత సమయం కేటాయిస్తారు. సినిమాలు, క్రికెట్‌ను విపరీతంగా ఇష్టపడతారు. తనకు నచ్చిన వాటి గురించి సోషల్ మీడియా ద్వారా ఇతరులతో పంచుకుంటారు. ఆదివారం వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ (CSK vs MI) జట్ల మధ్య ఐపీఎల్ (IPL 2024) మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ధోనీ (MS Dhoni) వరుస సిక్స్‌లతో హల్‌చల్ చేశాడు.


``ధోనీ కంటే గొప్పగా ఆడుతున్న మరో ఆటగాడిని చూపించగలరా? అతడిపై ఉన్న అంచనాలు, జట్టు పరిస్థితి ధోనీ సంకల్పాన్ని మరింత పెంచాయి. ధోనీ ఎప్పటికీ గొప్ప ఫినిషర్. నా పేరులో కూడా మహి ఉన్నందుకు చాలా గర్వపడుతున్నా`` అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. తన ట్వీట్‌కు సిక్స్ కొడుతున్న ధోనీ ఫొటోను జత చేశారు. ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ ట్వీట్‌ను ఇప్పటికే 13 లక్షల మందికి పైగా వీక్షించారు. 49 వేల మందికి పైగా లైక్ చేశారు.


ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్‌పై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``మహీ అండ్ మహీంద్రా``, ``ధోనీ ఎప్పటికీ లెజెండ్``, ``మీరిద్దరూ ఎవర్‌గ్రీన్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. చెన్నై బ్యాటింగ్ సమయంలో 20వ ఓవర్లో ధోనీ బ్యాటింగ్‌కు వచ్చాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఆ ఓవర్లో వరుసగా మూడు సిక్స్‌లు కొట్టాడు. కేవలం 4 బంతుల్లో 20 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ధోనీ సిక్స్‌లతో స్టేడియం హోరెత్తిపోయింది.

ఇవి కూడా చదవండి..

Hardik Pandya: చెత్త కెప్టెన్సీ.. చెత్త బౌలింగ్.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై దారుణ ట్రోలింగ్!


MS Dhoni: హ్యాట్రిక్ సిక్స్‌లతో చెలరేగిన ధోనీ.. డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళుతూ ధోనీ చేసిన పనికి హ్యాట్సాఫ్!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 15 , 2024 | 04:04 PM