Share News

NRI: ఖతర్‌లో తెలుగు ప్రవాసీకి ప్రతిష్ఠాత్మక 'సౌత్ ఐకాన్ (ఆంధ్రప్రదేశ్)' పురస్కారం

ABN , Publish Date - Dec 29 , 2024 | 07:23 AM

ఖతర్‌లో జరిగిన ప్రతిష్టాత్మక "సౌత్ ఇండియన్ గ్లోబల్ టాలెంట్ అచీవర్స్ (ఎస్ఐజీటీఏ) అవార్డ్స్ 2024" వేడుకలో ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులైన తెలుగు ప్రవాసి వెంకప్ప భాగవతుల "సౌత్ ఐకాన్ (ఆంధ్రప్రదేశ్)" అవార్డును గెలిచారు.

NRI: ఖతర్‌లో తెలుగు ప్రవాసీకి ప్రతిష్ఠాత్మక 'సౌత్ ఐకాన్ (ఆంధ్రప్రదేశ్)' పురస్కారం

ఎన్నారై డెస్క్: ఖతర్‌లో జరిగిన ప్రతిష్టాత్మక "సౌత్ ఇండియన్ గ్లోబల్ టాలెంట్ అచీవర్స్ (ఎస్ఐజీటీఏ) అవార్డ్స్ 2024" వేడుకలో ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులైన తెలుగు ప్రవాసి వెంకప్ప భాగవతుల "సౌత్ ఐకాన్ (ఆంధ్రప్రదేశ్)" అవార్డును గెలిచారు. ఖతర్‌లోని తెలుగు సమాజానికిచ, భారత సమాజానికి ఆయన అందించిన అసాధారణ కృషి, ప్రేరణాత్మక నాయకత్వం, వివిధ రంగాల్లో కనబరిచిన విశిష్ట ప్రతిభా పాటవాలు, సేవలకు గౌరవంగా ఈ అవార్డు ఆయనను వరించింది (NRI).

1.jpgNRI: సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ 100వ వార్షికోత్సవం - అతిరుద్ర మహాయాగం


"సౌత్ ఐకాన్ అవార్డు" అనేది ఎస్ఐజీటీఏ కార్యక్రమంలో అందించే అత్యున్నత గౌరవం. విదేశాల్లో నివసిస్తూ తమ మాతృభూమి సాంస్కృతిక వారసత్వం, నైతిక విలువలను పరిరక్షించడంలో, వాటిని ప్రోత్సహించడంలో విప్లవాత్మకమైన కృషి చేసిన ప్రవాసులకు ఈ అవార్డు ప్రకటిస్తారు. ఖతర్‌లోని ప్రపంచ ప్రఖ్యాత అల్ మయాసా థియేటర్ (క్యూఎన్‌సీసీ) లో జరిగిన ఈ ఘనమైన వేడుకకు 2,500 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమల ప్రముఖులు, వ్యాపార, వినోద, సాంస్కృతిక, సేవా, సామాజిక రంగాల నుండి ప్రతిష్టాత్మక వ్యక్తులు పాల్గొని తమ అభినందనలు తెలిపి ఈ కృషికి ఎంతో గౌరవం అర్పించారు. వెంకప్ప భాగవతుల ఖతర్ మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగు భాష, కళలు, సాంస్కృతిక వారసత్వం, సామాజిక సేవలో చేసిన అసాధారణ కృషికి గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికై, అందరి ప్రశంసలు, అభినందనలు పొందారు.

3.jpg

NRI: సింగపూర్‌లో కిరణ్ ప్రభ దంపతులు.. ఆహ్లాదకరంగా ముఖాముఖీ కార్యక్రమం..


ఈ సందర్భంగా వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ.. ‘‘"సౌత్ ఐకాన్ (ఆంధ్రప్రదేశ్‌)" అవార్డు పొందడం గర్వకారణంగా, గౌరవంగా భావిస్తున్నాను. ఈ గౌరవం నా బాధ్యతను మరింత పెంచింది" అని పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు సంబంధించి, ఎస్ఐజీటీఏ కార్యవర్గం, జ్యూరీ సభ్యులకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. "ఈ గుర్తింపు నా ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ చెందుతుంది. ఈ అవార్డును నా కుటుంబసభ్యులకు, ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ సభ్యులకు, నాకు ప్రేరణగా నిలిచే నా మిత్రులకు, అలాగే ఖతర్‌లోని తెలుగు సమాజానికి అంకితం చేస్తున్నాను" అని ఆయన అన్నారు.

2.jpgRead Latest and NRI News

Updated Date - Dec 29 , 2024 | 07:25 AM