Share News

St.Louis హిందూ దేవాలయ బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు

ABN , Publish Date - Apr 08 , 2024 | 09:45 PM

అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలోగల సెయింట్ లూయిస్ నగరంలోని సెయింట్ లూయిస్ హిందూ దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

St.Louis హిందూ దేవాలయ బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు

ఎన్నారై డెస్క్: అమెరికాలోని (USA) మిస్సోరి రాష్ట్రంలోగల సెయింట్ లూయిస్ నగరంలోని సెయింట్ లూయిస్ హిందూ దేవాలయ (St. Louis Hindu Temple) వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది మే 24 నుండి 28 వరకు అయిదు రోజుల పాటు శాస్త్రోక్తంగా, వీనులవిందుగా, సంప్ర దాయబద్ధంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

వీసా రూల్స్‌లో తక్షణ మార్పులు.. న్యూజిలాండ్ సంచలన ప్రకటన

ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణ సన్నాహక సమావేశాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు, బ్రహ్మోత్సవాల కమిటీ అధ్యక్షుడు గంగవరపు రజనీకాంత్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సాక్షి విజయ్, ఉత్సవాల కార్యదర్శి పుట్టగుంట మురళీ తదితరులతో పాటు బోర్డు సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద కార్యకర్తలు, భక్తులు ఈ సన్నాహక సమావేశంలో పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవల్సిన చర్యలు, చేయవల్సిన ఏర్పాట్లపై సమీక్షించారని బ్రహ్మోత్సవాల మీడియా కమిటీ అధ్యక్షుడు సూరపనేని రాజా ఓ ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు https://www.hindutemplestlouis.org/services/ వెబ్‌సైట్ చూడవచ్చు.

1.jpg


ఈ సమావేశంలో వాలంటీర్లను కమిటీల్లోకి నియమించారు. వీరిని ఆయా కమిటీల్లోకి చేరవల్సిందిగా కోరారు. మాజీ అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి నాయుడు గంట మోగించి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ప్రారంభించారు. తంజావూరు నుండి ప్రత్యేకంగా తయారు చేసిన నంది, గజ, హనుమ, సూర్య, శేష వాహనాలపై స్వామివారిని ఊరేగిస్తారు. ఈ ఊరేగింపు కోసం ఆలయం వెలుపల మాఢవీధులను నిర్మిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఊరేగింపు కోసం ప్రత్యేక రథాన్ని సైతం తయారు చేస్తున్నామని వెల్లడించారు. దీనితో పాటు అర్చకస్వాముల నివాస గృహాలను కూడా నిర్మిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 08 , 2024 | 09:47 PM