Share News

TDP: మండుటెండలోనూ సౌదీలో టీడీపీ విజయోత్సవ పరంపర

ABN , Publish Date - Jun 09 , 2024 | 08:37 PM

గల్ఫ్ దేశాలలో క్రమేణా హెచ్చుతున్న ఉష్ణోగ్రతలు, మండుటెండల్లో బయటకు వెళ్ళడానికి జంకుతున్న ప్రతికూల పరిస్థితుల్లో సైతం తెలుగుదేశం అభిమానులు పార్టీ విజయోత్సవ పండుగను చేసుకొంటూ ఆస్వాదిస్తున్నారు.

TDP: మండుటెండలోనూ సౌదీలో టీడీపీ విజయోత్సవ పరంపర

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలలో క్రమేణా హెచ్చుతున్న ఉష్ణోగ్రతలు, మండుటెండల్లో బయటకు వెళ్ళడానికి జంకుతున్న ప్రతికూల పరిస్థితుల్లో సైతం తెలుగుదేశం అభిమానులు (NRI) పార్టీ విజయోత్సవ పండుగను చేసుకొంటూ ఆస్వాదిస్తున్నారు.

ఎడారి వేడిని కాదని తెలుగుదేశం పార్టీ సౌదీ అరేబియా శాఖ ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ వేడుకలలో ప్రవాసీయులు పాల్గొన్నారు. శుక్రవారం దమ్మాంలో జరిగిన విజయోత్సవ సభలో పాల్గొన్న పార్టీ అభిమానులు ఆనందపు కెరటాలతో గంతులేసారు.

TDP: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం.. యూకేలో ఎన్నారైల సంబరాలు

1.jpg


ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ మాట్లాడుతూ పార్టీ అధికారంలో లేక స్వదేశంలో వేధింపులకు గురవుతూ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్న కష్టకాలంలో కూడా సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలలోని టీడీపీ అభిమానులు పార్టీపై నిబద్ధతతో పని చేయడమే కాకుండా స్వదేశంలోని తమ బంధుమిత్రులను కూడా చంద్రబాబు నాయుడును సమర్ధించవల్సిందిగా కోరుతూ అండగా నిలిచారని అన్నారు.

3.jpgతెలుగుదేశం పార్టీ సౌదీ అరేబియా శాఖ అధ్యక్షుడు ఖలీద్ సైఫుల్లా పార్టీ ఆశయాల గురించి వివరించారు. తెలుగుదేశం పార్టీ కూటమిలో బీజేపీ చేరడంపై అనేక మంది ముస్లింలు తమను ప్రశ్నించారని కానీ చంద్రబాబు నాయుడుపై ఉన్న సంపూర్ణ విశ్వాసంతో అందరితో పాటు ముస్లింలు కూడా తెలుగుదేశాన్ని సమర్ధించారని సైఫుల్లా పేర్కొన్నారు.

కార్యక్రమంలో దీపిక, జాకీర్, భరద్వాజ్, కొగంటి శ్రీనివాస రావు, చంద్రశేఖర్, భూపతిరెడ్డి, ఆబూబకర్, అవినాష్, తేజ, నగేశ్, జి.భాస్కర్ రావు, అప్పాజీ, రాజు, పవన్ దాసం, శర్మ చివుకుల, శ్రీనికేత్, వైదీక్, ఆమాన్, మోహమ్మద్ అలీ, మహేశ్వర్ రెడ్డి, జమీల్ తదితరులు పాల్గొన్నారు.

Read Latest NRI News and Telugu News

Updated Date - Jun 09 , 2024 | 08:37 PM