Share News

Shani Dev: శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే వీటిని నైవద్యంగా సమర్పించండి..

ABN , Publish Date - Feb 26 , 2024 | 02:15 PM

Shani Dev: హిందూ మతంలో ఒక్కో దేవతా మూర్తిని పూజించడానికి ఒక్కో విధానం ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం, నియమాల ప్రకారం పూజించడం వలన దేవుళ్లు(God) సంతోషిస్తారు. సరైన విధానంలో పూజ(Devotees) చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. పూజకు సంబంధించిన అనేక నియమాలలో నైవేద్యం కూడా ఒకటి.

Shani Dev: శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే వీటిని నైవద్యంగా సమర్పించండి..
Shani Dev

Shani Dev: హిందూ మతంలో ఒక్కో దేవతా మూర్తిని పూజించడానికి ఒక్కో విధానం ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం, నియమాల ప్రకారం పూజించడం వలన దేవుళ్లు(God) సంతోషిస్తారు. సరైన విధానంలో పూజ(Devotees) చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. పూజకు సంబంధించిన అనేక నియమాలలో నైవేద్యం కూడా ఒకటి. అంటే పూజ సమయంలో దేవుడికి ఇష్టమైన వస్తువులను సమర్పించాల్సి ఉంటుంది.

పూజలో నైవేద్యాన్ని సమర్పించడం ముఖ్యమైన ప్రక్రియ. అయితే, నైవేద్యం సమర్పణలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇక శని దేవుడి విషయానికి వస్తే ఈ విధానం విభిన్నంగా ఉంటుంది. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. శని దేవుడిని ఆరాధించడం, ఇష్టమైన వస్తువులను నైవేధ్యంగా సమర్పించం ద్వారా శని దేవుడు సంతోషిస్తాడని, అశుభ ప్రభావాలు కూడా తగ్గుతాయని విశ్వాసం. మరి శని దేవుడి పూజలో ఎలాంటి వస్తువులను నైవేద్యంగా సమర్పించాలో ఈ కథనంలో తెలుసుకుందాం..

శని దేవుడికి ఇష్టమైన వస్తువులు..

పూజా సమయంలో శని దేవుడికి కొన్ని ప్రత్యేక వస్తువులు నైవేద్యంగా అర్పిస్తారు. శని దేవుడిని పూజించేటప్పుడు.. బెల్లం, నల్ల మినుములతో ఖిచ్డీ, నల్ల నువ్వులతో చేసిన పదార్థాలు, స్వీట్ పూరీ, గులాబ్ జామ్ మొదలైన వాటిని సమర్పించవచ్చు. అయితే నైవేద్యం స్వచ్ఛంగా, ధర్మబద్ధంగా ఉండాలి. ఈ వస్తువులను నైవేద్యంగా అర్పించడం వలన శని దేవుడు సంతోషిస్తాడు. అంతేకాకుండా, శని దోషం, సడేసతి, ధైయ, మహాదశ ప్రభావం కూడా జాతకచక్రం నుండి తగ్గుతుందని విశ్వాసం.

ఈ విషయాలను గుర్తుంచుకోండి..

☛ శని దేవుడికి నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు, సాత్విక పద్ధతిలో ఆహారాన్ని తయారు చేయాలి.

☛ నైవేద్యంలో వెల్లుల్లి, ఉల్లి వంటి వాటిని వాడకూడదు.

☛ ఇత్తడి లేదా రాగి పాత్రలో శని దేవుడికి ఎప్పుడూ నైవేద్యాన్ని అందించవద్దు.

☛ శని దేవుడికి నైవేద్యంగా పెట్టేందుకు ఇనుప పాత్రలు ఉత్తమంగా పరిగణిస్తారు.

☛ శని దేవుడిని పూజించేటప్పుడు నలుపు లేదా నీలం రంగు దుస్తులను ధరించాలి.

☛ పూజ సమయంలో శని దేవుడి కళ్ళలోకి చూడకూడదు.

శని దేవునికి నైవేద్యం సమర్పించే సమయంలో పఠించాల్సిన మంత్రాలు..

శని దేవుడికి నైవేద్యం సమర్పించిన తరువాత నల్ల తులసితో కూడిన జపమాలతో ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఆ తరువాత, నువ్వులు లేదా ఆవాల నూనెతో దీపం వెలిగించి, శని దేవుడికి హారతి ఇవ్వాలి. ఈ క్రతువు పూర్తయిన తరువాత శని దేవుడిని ఆర్తి పఠించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 26 , 2024 | 02:16 PM