Share News

kitchen garden : కిచెన్ గార్డెన్‌లో పెంచేందుకు అనువైన మొక్కలలో ఇవి ... !

ABN , Publish Date - Feb 09 , 2024 | 04:46 PM

ఆహారంలో తాజా ఆకుకూరలను చేర్చుకోవడం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వీటిని కిచెన్ గార్డెన్‌లో సులభంగా పెంచుకోవచ్చు.

kitchen garden : కిచెన్ గార్డెన్‌లో పెంచేందుకు అనువైన మొక్కలలో ఇవి ... !
kitchen garden

ఆహారంలో తాజా ఆకుకూరలను చేర్చుకోవడం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వీటిని కిచెన్ గార్డెన్‌లో సులభంగా పెంచుకోవచ్చు. కిచెన్ గార్డెన్‌లో పెంచుకునే కొన్ని ఆకు కూరలు ఏవంటే..

కొత్తిమీర..

కొత్తి మీర ఆహారంలో అత్యంత సాధారణమైన పదార్థాలలో ఒకటి. ఈ మొక్కను కిచెన్ గార్డెన్ లో పెంచుకోవచ్చు, కొత్తిమీరలోని సువాసన చాలా వంటకాలకు పైన చల్లితేనే మంచి వాసన, ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది.

ఒరేగానో..

దీనిని తక్కువగా ఉపయోగించినా.. ముఖ్యంగా అంటువ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణ సమస్యలను నివారిస్తుంది.

రోజ్మెరీ..

రోజ్మెరీ వంటలలో అలాగే ఔషదంగా కూడా ఉపయోగిస్తారు. ఈ సువాసన గల మొక్కను చాలా సులువుగా కిచెన్ గార్డెన్‌లో పెంచుకోవచ్చు. మంచి ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఈ ఆకులను పానీయాలలో కూడా ఉపయోగిస్తారు.

ఇది కూడా చదవండి: బరువు తగ్గాలని ఫిక్స్ అయితే ఈ స్నాక్స్ తీసుకోండి..!


పొదీనా..

పొదీనాను కిచెన్ గార్డెన్ లో సులువుగా పెంచుకోవచ్చు. దీని ప్రత్యేకమైన రుచి, వాసన ఇట్టే ఆకట్టుకుంటాయి. ఈ హెర్బ్ ఆకులు సైనస్ రద్దీని క్లియర్ చేయడంలో సహకరిస్తాయి. కడుపు నొప్పులను, జీర్ణక్రియ సమస్యను తొలగించడంలో పుదీనా ముందుంటుంది.

తులసి..

పవిత్రమైన భావనతో పాటు తులసి ఆకులను టీ రూపంలో తీసుకున్నాకూడా మంచి చేస్తుంది. ముఖ్యంగా తులసిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇది శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తుంది. వాపును తగ్గిస్తుంది.

నిమ్మగడ్డి..

దీనిని ఔషదంగా వాడతారు. అలాగే దీనిని పెంచడం కూడా చాలా తేలిక. ఈ మొక్కలో ఉన్న వైద్య లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Updated Date - Feb 09 , 2024 | 04:48 PM