Share News

కడుపు కండరాల కోసం...

ABN , Publish Date - May 07 , 2024 | 12:47 AM

కొందరు ఉదయాన్నే లేచి వ్యాయామం తప్పనిసరిగా చేస్తూ ఉంటారు. వీటిలో కడుపు కండరాలకు మేలు చేసే ఎబ్‌డామెన్‌ ఎక్సర్‌సైజ్‌లు ఉంటాయి. వీటివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం

కడుపు కండరాల కోసం...

కొందరు ఉదయాన్నే లేచి వ్యాయామం తప్పనిసరిగా చేస్తూ ఉంటారు. వీటిలో కడుపు కండరాలకు మేలు చేసే ఎబ్‌డామెన్‌ ఎక్సర్‌సైజ్‌లు ఉంటాయి. వీటివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

  • కండరాలు బలపడతాయి

ప్రతి రోజూ వ్యాయామం చేయటం వల్ల కడుపు ప్రాంతంలో ఉన్న కండరాలు బలపడతాయి. దీని ప్రభావం మొత్తం శరీరంపై పడుతుంది. దీనివల్ల నిటారుగా నిలబడగలుగుతారు. చురుకుగా కదలగలుగుతారు. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎటువంటి సాయం లేకుండా నేల మీద నుంచి లేచి నిలబడగలుగుతారు. ఎక్కువసేపు నేలపై కూర్చోగలుగుతారు. ఒంటి నొప్పులు తగ్గుతాయి.

  • శరీరాకృతిలో మార్పు...

చాలామందికి నిలబడే విధానంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ వ్యాయామం చేయటం వల్ల ఈ సమస్యలన్నీ తొలగిపోయి నిటారుగా నిలబడగలుగుతారు.

దీని ప్రభావం వారి శ్వాసపై పడుతుంది. ఎక్కువ ఆక్సిజన్‌ అందుతుంది. అంతే కాకుండా ఈ వ్యాయామ ప్రభావం వారి మానసిక స్థితిపై కూడా పడుతుంది. వారు మరింత ఆత్మ విశ్వాసంతో పని చేసుకోగలుగుతారు. ఆందోళన, డిప్రషన్‌ వంటి సమస్యలు తొలగిపోతాయి.

  • జాగ్రత్తలు...

ఈ వ్యాయామంవల్ల అనేక రకాల లాభాలు ఉన్నా.. వ్యాయామం చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాయామం తప్పుగా చేస్తే దాని వల్ల మొత్తానికే మోసం వచ్చే అవకాశముంది.

Updated Date - May 07 , 2024 | 12:47 AM