Share News

‘ఆస్క్‌ మి ఎనీథింగ్‌’కు అదనపు హంగులు

ABN , Publish Date - May 18 , 2024 | 02:24 AM

రెడిట్‌ ‘ఆస్క్‌ మి ఎనీథింగ్‌’ ఫీచర్‌కు కొత్త టూల్స్‌ని జోడించింది. గెస్ట్‌ కొలాబిరేటర్స్‌, షెడ్యూల్డ్‌ సెషన్స్‌ క్లియర్‌ ఎండింగ్స్‌, ఆర్‌ఎస్‌వీపీ ఆప్షన్స్‌, సార్టింగ్‌ ఫీచర్స్‌, కమ్యూనిటీ సపోర్ట్‌ కోసం డెడికేటెడ్‌ ఎఎంఏ(ఆస్క్‌మి ఎనీథింగ్‌) హబ్‌ ఉన్నాయి. అవి వరుసగా

‘ఆస్క్‌ మి ఎనీథింగ్‌’కు అదనపు హంగులు

రెడిట్‌ ‘ఆస్క్‌ మి ఎనీథింగ్‌’ ఫీచర్‌కు కొత్త టూల్స్‌ని జోడించింది. గెస్ట్‌ కొలాబిరేటర్స్‌, షెడ్యూల్డ్‌ సెషన్స్‌ క్లియర్‌ ఎండింగ్స్‌, ఆర్‌ఎస్‌వీపీ ఆప్షన్స్‌, సార్టింగ్‌ ఫీచర్స్‌, కమ్యూనిటీ సపోర్ట్‌ కోసం డెడికేటెడ్‌ ఎఎంఏ(ఆస్క్‌మి ఎనీథింగ్‌) హబ్‌ ఉన్నాయి. అవి వరుసగా...

  • ఇటు నిర్వాహకుడు, అటు పార్టిసిపెంట్స్‌ మధ్య ఎంగేజ్‌మెంట్‌ మరింత ఉన్నతంగా ఉండేందుకు ఎఎంఏ టూల్‌ని ప్రవేశపెట్టారు. సెలిబ్రిటీస్‌, పబ్లిక్‌ ఫిగర్స్‌, సంస్థలు వంటివి మరింత లోతుగా ఇంటరాక్షన్‌ జరుపుకొనేందుకు దీంతో వీలుపడుతుంది.

  • గెస్ట్‌ కొలాబిరేటర్స్‌ ఈ వరుసలో మరొకటి. నిర్వాహకులు అయిదుగురు అతిథులను పిలుచుకోవచ్చు. వారితో కూడా జవాబులు ఇప్పించవచ్చు. తద్వారా చర్చను మరింత సుసంపన్నం చేసుకోవచ్చు.

  • షెడ్యూల్డ్‌ ఏఎంఏ అంటే ఇలాంటి సమావేశాలను ముందుగానే ప్లాన్‌ చేసుకోవచ్చు. 21 రోజుల ముందే పార్టిసిపెంట్లకు తెలియజేయవచ్చు. అలా మొత్తం ప్రక్రియను స్ట్రీమ్‌లైన్‌ చేసుకోవచ్చు.

  • క్లియర్‌ ఎండింగ్స్‌ అంటే ఎలాంటి సంశయానికి తావులేకుండా నిర్వాహకుడు సమావేశాన్ని ముగించవచ్చు. అంతేకాదు నిర్వాహకుడు కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు ఇతర సోషల్‌ చానళ్లకు యూజర్లను డైరెక్ట్‌ చేయవచ్చు.


  • ఆర్‌ఎస్‌వీపీ అంటే సింపుల్‌గా పార్టిసిపెంట్ల అటెండెన్స్‌ను ఒక క్లిక్‌తో పూర్తి చేయవచ్చు. సమావేశం ఆరంభం కావడానికి 24 గంటల మందు నోటిఫికేషన్లను పంపుకోవచ్చు. ఇదంతా ఇబ్బంది లేకుండా సజావుగా జరిపించవచ్చు.

  • సార్టింగ్‌ ఆప్షన్స్‌ ఇంకొకటి. జవాబు వచ్చినవి, రానివి ఏవి అన్నవి సులువుగా పార్టిసిపెంట్స్‌ తెలుసుకోవచ్చు. తద్వారా చర్చను అవసరమైన వాటి దిశగా నడిపించవచ్చు. అంటే చర్చను సమర్థంగా సాగించవచ్చు.

  • ఏఎంఏ హబ్‌ అంటే కేంద్రీకృత రిసోర్స్‌. కమ్యూనిటీ మెంబర్లు ఈ వనరులతో సొంతంగా ఏఎంఏలు నిర్వహించుకోవచ్చు. ఒకరకంగా ఇది ఉన్న వనరును సద్వినియోగం చేసుకోవడం కిందకు వస్తుంది.

Updated Date - May 18 , 2024 | 02:24 AM