Share News

Glowing skin: మెరిసే చర్మానికి ఆయుర్యేద ఫేస్ ప్యాక్స్ ఇవే..!!

ABN , Publish Date - Jan 03 , 2024 | 04:09 PM

కాలం మారుతున్న కొద్దీ వచ్చిన మార్పులతో పాటు సౌందర్య సాధనాల విషయంగా కూడా మార్పు వచ్చింది. ఇప్పటిరోజుల్లో ముఖాన్ని అందంగా ఉంచడానికి రకరకాల ప్యాక్స్ అఫ్లయ్ చేస్తూ ఉంటాం.

Glowing skin: మెరిసే చర్మానికి ఆయుర్యేద ఫేస్ ప్యాక్స్ ఇవే..!!
glowing skin

పూర్వంలో అధునాతన వైద్య ప్రమాణాలు ఉండేవి కాదు. అప్పుడు ఆయుర్వేదమే అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపించేది. కాలం మారుతున్న కొద్దీ వచ్చిన మార్పులతో పాటు సౌందర్య సాధనాల విషయంగా కూడా మార్పు వచ్చింది. ఇప్పటిరోజుల్లో ముఖాన్ని అందంగా ఉంచడానికి రకరకాల ప్యాక్స్ అఫ్లయ్ చేస్తూ ఉంటాం. అందంగా ఉండడానికి చర్మ సమస్యలు తొలగిపోయేందుకు ఈ ప్యాక్స్ సహకరిస్తాయి. డీప్ క్లెన్సింగ్, టోనింగ్, మెడికేటెడ్, మాస్కస్ వంటివి వేస్తూ ఉంటాం. ఇవి అన్ని రకాల చర్మాలకు నిగారింపునిస్తాయి. మెరిసే ముఖ కాంతికి, చర్మానికి ఆయుర్వేదం..

1. పసుపు, శనగపిండి.. పసుపు, శనగపిండి కలిపి ముఖానికి ప్యాక్ గా వేయడం వల్ల చర్మం మెరుస్తుంది. ఈ మిశ్రమాన్ని కలిపేందుకు రోజ్ వాటర్ లేదా పెరుగు వాడితే మంచిది.

2. వేప ముల్తానీ మిట్టి.. ముల్తానీ మిట్టితో వేప పొడిని కలిపి పేస్ట్ లా చేయాలి. దీనిలో రోజా వాటర్ కలపాలి.

3. చందనం, రోజ్ వాటర్ ప్యాక్.. గంధపు పొడిని, రోజ్ వాటర్తో కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని ఆరిన తర్వాత కడిగేయాలి.

4. అలోవెరా, హనీ ప్యాక్.. తాజా అలోవెరా జెల్ ను తేనెతో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి కడిగేయాలి.

5. పెరుగు, ఆరెంజ్ పీల్ పౌడర్.. ఎండిన ఆరెంజ్ పొడిని పెరుగుతో కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత శుభ్రం చేయాలి.

ఇది కూడా చదవండి: పొట్ట చుట్టూ కొవ్వును కరిగించే జపనీస్ వ్యాయామాలు ఇవే.. ఓసారి ట్రైచేసి చూడండి..!


6. పుదీనా, దోసకాయ ప్యాక్.. పుదీనా, దోసకాయతో కలిపి పేస్ట్ లా చేయాలి. మిశ్రమాన్ని అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.

7. మెంతులు, పెరుగు ప్యాక్.. మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి, పేస్ట్ లా గ్రైండ్ చేసి, పెరుగుతో కలపాలి.

8. బొప్పాయి, తేనె ప్యాక్.. పండిన బొప్పాయిని మెత్తగా చేసి అందులో తేనె కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.

9. బాదం, మిల్క్ ప్యాక్.. బాదంపప్పును రాత్రంతా నానబెట్టి, వాటిపై పొరను తీసి, పేస్ట్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ గా వేయాలి.

10. శెనగ పిండి, నిమ్మకాయ ప్యాక్.. శెనగపిండిని, నిమ్మరసం, రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ లాగా వేయాలి.

Updated Date - Jan 03 , 2024 | 04:09 PM