Share News

Story : కుందేలు తెలివి

ABN , Publish Date - Jan 18 , 2024 | 03:19 AM

పెద్ద తుఫాను. భీకరమైన వర్షానికి నది పారుతోంది. ఓ కుందేలు పిల్ల నీటిలో కొట్టుకుని పోయి బ్రతికిపోయింది. బతికినందుకు సంతోషపడింది. ఆ రాత్రివేళ దాటిన తర్వాత చూస్తే తనో లంకలో

Story : కుందేలు తెలివి

పెద్ద తుఫాను. భీకరమైన వర్షానికి నది పారుతోంది. ఓ కుందేలు పిల్ల నీటిలో కొట్టుకుని పోయి బ్రతికిపోయింది. బతికినందుకు సంతోషపడింది. ఆ రాత్రివేళ దాటిన తర్వాత చూస్తే తనో లంకలో విసిరివేయబడ్డది. అక్కడ ఉండే పచ్చగడ్డి, దొరికిన ఆహారం తిని రోజూ ఏడ్చేది. దేవుడు ఎంత దొంగవాడు అనుకుంటూ తిట్టుకునేది.

ఒక రోజు లంకలో ఏడుస్తూ కూర్చుంది కుందేలు. ఓ దుంగ తేలుతూ వస్తోంది. అది మొసలి అని అర్థం చేసుకుంది. మొసలి బావా నీ గురించి తెలుసులే.. తల పైకెత్తు అన్నది. మొసలి ఆశ్చర్యపోయింది. కుందేలు ఇలా అన్నది.. ‘ఈ గడ్డిమీదకు రా. ఎప్పుడూ నీళ్లలోనే ఉంటావు. మాలా ఆడుకోలేవు. గంపెడు పిల్లలు మీకు ఉండరు కదా?’ అన్నది కుందేలు. ‘అదేంటీ.. అలా అంటున్నావు. మాకేమీ కాదు. నీళ్లలోనే ఉంటాం’ అన్నది. ‘అయినా మీ గుడ్లుమీరే తింటారట కదా. మీకు పిల్లలు ఎక్కడివిలే’ అన్నది వెటకారంగా. ఇది అబద్ధం. అయినా నీలా మాట్లాడించేవారు లేరు.. అన్నది భోరున ఏడుస్తూ మొసలి. ‘మాలా సంతోషంగా గడపటం మీకు రాదు. ఆకారం పెద్దది. తెలివి తక్కువ’ అన్నది. మొసలి కోప్పడింది. ‘కోప్పడి ఉపయోగం లేదు. పట్టుమని వంద మంది దండు కూడా మీరు ఉండరు’ అన్నది. మొసలి రోషంగా తీసుకుంది. కేకలేసింది. నిముషాల్లో నీళ్లలో మునిగిన మొసళ్లు వచ్చాయి. భయంతో లోలోపల కుందేలు వణికిపోయింది.

ఇపుడు చూశావా? నా తడాఖా అన్నది మొసలి. అయినా మీరు ఈ లంకనుంచి ఆ తీరం వరకు వరుసగా ఉంటే తీరం కూడా తాకదులే అన్నది వెటకారంగా. వెంటనే మొసళ్లను వంతెనలా కట్టమన్నది. అన్నీ వరుసగా వంతెనలా కట్టాయి. ‘కనీసం వంద ఉంటే గొప్పనేమో’ అన్నది కుందేలు. ‘ఎంచుకో’ అన్నది మొసలి. ‘మీరంతా దగ్గరగా ఉండండి. అప్పుడు లెక్కపెడతా’ అన్నది కుందేలు. ఒకదాని మీద ఎగురుతూ అవతలి తీరం మీదకు క్షణాల్లో వెళ్లిపోయింది. తీరం వెళ్లిన తర్వాత పొట్టపట్టుకుని కుందేలు నవ్వింది. ఎందుకంత నవ్వు? అన్నది మొసలి. ‘ఏమీ లేదు. ఆ లంకలో ఏడ్చాను ఇన్నాళ్లు. మీరు పేరుగా పెద్ద జీవాలు. మెదడు లేదు. దేవుడు తెలివి ఇవ్వలేదు. నాకు తెలివి ఇచ్చాడు. నేను ఏమి చెబితే అది చేశావు. నీ మూర్ఖత్వానికి జోహార్లు’ అంటూ కుందేలు నవ్వింది. కుందేలు మోసం చూసి మొసలి గట్టిగా ఏడ్చింది.

Updated Date - Jan 18 , 2024 | 03:19 AM