Share News

Story : మూర్ఖ పుత్రులు

ABN , Publish Date - Feb 08 , 2024 | 11:04 PM

ఒక ఊరిలో సోమయ్య అనే షావుకారు ఉండేవాడు. అతనికి వందెకరాలకు పైగా భూమి. ఎంతో పేరున్న మనిషి. ఇల్లంతా పనివాళ్లు, చేలో పనులు.. ఎప్పుడూ ఏదో పనిలో నిమగ్నమై ఉండేవాడు. అతనికి పక్కన ఉండే పది ఊర్లలో పేరుంది. అయితే అతనికి ఉండే

Story : మూర్ఖ పుత్రులు

ఒక ఊరిలో సోమయ్య అనే షావుకారు ఉండేవాడు. అతనికి వందెకరాలకు పైగా భూమి. ఎంతో పేరున్న మనిషి. ఇల్లంతా పనివాళ్లు, చేలో పనులు.. ఎప్పుడూ ఏదో పనిలో నిమగ్నమై ఉండేవాడు. అతనికి పక్కన ఉండే పది ఊర్లలో పేరుంది. అయితే అతనికి ఉండే ఇద్దరు కొడుకులు కూడా అజ్ఞానులని పేరుంది. ఇద్దరి కొడుకులకు అంత విలువ ఉండేది కాదు. తండ్రి ఆస్తిని తింటున్నారు. ఏమీ చేయలేని చవటలు అని తిట్టిపోసేవారు కొందరు. పైగా తన తండ్రి మాటలను లెక్క చేసేవారు కాదు. దీంతో వారిద్దరినీ ఏదో పని కల్పించాలనుకున్నాడు షావుకారు.

ఒక రోజు పక్క ఊరిలోని జమీందారు చనిపోయాడు. వెంటనే షావుకారు తన పెద్ద కొడుకుని పిలిచి జమీందారు కుటుంబాన్ని పరామర్శించి వచ్చేయ్‌ అన్నాడు. ‘ఏమని పరామర్శించాలి’ అని అడిగాడు. ‘నలుగురు ఎలా చెబుతుంటే అలా చెప్పు’ అన్నాడు. షావుకారు పెద్ద కొడుకు ఆ జమీందారు ఊరికి వెళ్లాడు. జమీందారు గురించి ఓ వ్యక్తిని అడిగాడు. ‘పరమ దుర్మార్గుడు. చచ్చి మంచి పని అయ్యింది’ అన్నాడు. వెంటనే జమీందారు ఇంటికి చేరుకున్నాడు షావుకారు కొడుకు. జమీందారు ఇంట్లో శోకం. జమీందారు భార్య దగ్గరకు వెళ్లి తన గురించి పరిచయం చేసుకున్నాడు. ‘పరమ దుర్మార్గుడు. చచ్చి మంచి పని అయ్యింది’ అన్నాడు. ఆ మాటలు విని జమీందారు పిల్లలు, బంధువులు అతన్ని చావబాదారు. బతుకు జీవుడా.. అనుకుంటూ ప్రాణాలతో ఇంటికి వచ్చాడు.

తన అన్న పరిస్థితి చూసి తమ్ముడు కోప్పడ్డాడు. వెంటనే విషయం తెలుసుకుని జమీందారు ఇంటికి వెళ్లాడు. ‘మా అన్నకు తెలీదు. వాడు అజ్ఞాని. ఈ సారి మీ ఇంట్లో ఇలా జరిగితే చెప్పండి. వచ్చి నేను పరామర్శిస్తాను’ అన్నాడు తమ్ముడు. వెంటనే అతన్ని కూడా చావబాదారు ఆ ఇంట్లో వాళ్లు.

Updated Date - Feb 08 , 2024 | 11:04 PM