Share News

మీకు తెలుసా?

ABN , Publish Date - Mar 16 , 2024 | 11:38 PM

ఖడ్గంలాంటి ఒంటి కొమ్మును కలిగి ఉండటం వల్లనే దీన్ని ఖడ్గ మృగము అని పిలుస్తారు. ప్రపంచంలో కేవలం ఇవి ఐదు జాతులు మాత్రమే ఉన్నాయి. ఒకటి ఆఫ్రికాలో తెలుపు, నలుపు ఖడ్గమృగాలు. మూడోది ఆసియన్‌ రినో. వీటికి కేవలం ఒకే ఒక్క

మీకు తెలుసా?

ఖడ్గంలాంటి ఒంటి కొమ్మును కలిగి ఉండటం వల్లనే దీన్ని ఖడ్గ మృగము అని పిలుస్తారు. ప్రపంచంలో కేవలం ఇవి ఐదు జాతులు మాత్రమే ఉన్నాయి. ఒకటి ఆఫ్రికాలో తెలుపు, నలుపు ఖడ్గమృగాలు. మూడోది ఆసియన్‌ రినో. వీటికి కేవలం ఒకే ఒక్క కొమ్ము ఉంటుంది. ఇవి మన దగ్గర ఉంటాయి. వీటితో పాటు సుమత్రా, జావన్‌ రినో.

  • మనకు జుట్టు, గోర్లు పెరిగినట్లే వీటికి కొమ్ము పెరుగుతుంది. ఇది కెరోటిన్‌ నిర్మితమే. కాకపోతే చాలా గట్టిగా ఉంటుంది. ఇది తలచుకుంటే కారును కూడా కొమ్ముతో బోల్తా కొట్టించగలదు.

  • తెలుపు ఖడ్గమృగాలు అతి పెద్దవి. వీటి బరువు సుమారు 3500 కేజీలు ఉంటుంది. అతి చిన్నవి సుమత్రా రినోస్‌. వీటి బరువు 600 కేజీలు ఉంటాయి.

  • మగ జంతువులను ‘బుల్స్‌’ అని.. ఆడ జంతువును ‘కౌ’ అని పిలుస్తారు.

  • వీటి చూపు తక్కువ. కేవలం 30 మీటర్ల దూరంలో ఉండేవి కనిపించవు. అయితే ఇవి వాసన పట్టడంలో గ్రేట్‌. తన దగ్గరకు ఏవి వస్తున్నాయో అంచనా వేయగలవు.

  • ఆఫ్రికన్‌ రినోలతో పోలిస్తే ఆసియన్‌ రినోలు వేగంగా ఈదగలవు. నదిని సైతం సునాయసంగా ఈదగలవు. ముఖ్యంగా ఏ రినో అయినా బురదలో ఉండటానికి ఇష్టపడుతుంది. బురదను కోటింగ్‌లా వేసుకోవటం వల్ల దోమలు, ఇతర కీటకాల బారినుంచి రక్షించుకోగలుగుతాయి.

  • వియత్నాంలో రినో కొమ్ము స్టేటస్‌ సింబల్‌. దీంతో పాటు కొన్నిచోట్ల క్యాన్సర్‌, ఇతర వ్యాధులను అంతమొందించటానికి వీటిని వాడతారట. దీంతో పాటు ఇతర భాగాలు కొన్ని ఔషధాల్లో విలువైనవట. అందుకే వీటిని వేటాడటానికి ప్రత్యేకమైన గ్యాంగ్స్‌ ఉన్నాయి. గత పదేళ్ల కాలంలో 7,100 రినోలను వేటగాళ్లు అంతమొందించారు. దీన్ని బట్టి వీటి సంఖ్య నానాటికీ ఎంత దిగజారిపోతుందో అర్థం చేసుకోవచ్చు. వీటిని వేటాడటానికి హెలికాప్టర్లలో వచ్చి కేవలం పది నిముషాల్లోనే ఎత్తుకెళ్లే ముఠాలున్నాయి.

  • వీటి మెదడు చిన్నది. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో పరిగెత్తుతాయి.

  • సుమత్రా రినో మాత్రం మనుషులకు దగ్గరగా ఉంటుంది.

  • రినోల పిల్లలు చిన్నప్పుడే పులుల బారిన పడుతుంటాయి.

Updated Date - Mar 16 , 2024 | 11:38 PM