Share News

Technology : త్వరలో వివో వై200 ప్రొ

ABN , Publish Date - May 18 , 2024 | 02:12 AM

వివో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ ‘వివో వై200 ప్రొ’ని ఇండియన్‌ మార్కెట్లోకి విడుదల చేయనుందని సమాచారం. ‘91 మొబైల్స్‌’ నివేదిక ప్రకారం మన దేశంలో దీని ధర రూ.25,000గా ఉండనుంది.

Technology : త్వరలో   వివో వై200 ప్రొ

వివో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ ‘వివో వై200 ప్రొ’ని ఇండియన్‌ మార్కెట్లోకి విడుదల చేయనుందని సమాచారం. ‘91 మొబైల్స్‌’ నివేదిక ప్రకారం మన దేశంలో దీని ధర రూ.25,000గా ఉండనుంది. 3డి కర్వ్డ్‌ డిస్‌ప్లేతో ఫోన్‌ ఆకట్టుకునేలా ఉంది. క్వాల్కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 695 ఎస్‌ఓసీతో సజావైన పర్ఫార్మెన్స్‌కు తోడు 120హెచ్‌జెడ్‌ రిఫ్రష్‌ రేటు ఉంది.

ఫొటోగ్రఫి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిసింది. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌(ఓఐసీ)తో యాంటీ షేక్‌ కెమెరాను కలిపింది. స్టడీ షాట్స్‌కు ఈ ఏర్పాటు ఉపయోగపడనుంది. నైట్‌ ఫొటోగ్రఫీ, పోర్ట్రయిట్‌ మోడ్‌ కూడా ఉన్నాయి.

బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌(బీఐఎస్‌) సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్స్‌లో కనిపించడంతో భారత దేశంలో ఈ ఫోన్‌ విడుదలపై వార్తలు గుప్పుమన్నాయి. సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్స్‌లో ఉన్న మోడల్‌ నంబర్‌ ఒకటి కాగా మార్చిలో లీక్‌ అయిన వివరాల ఫోన్‌ నంబర్‌ మరొకటి. మొత్తమ్మీద రీబ్రాండింగ్‌ వ్యూహాంగా నిపుణులు అంచనా వేస్తున్నారు.

Updated Date - May 18 , 2024 | 02:12 AM