Rose Petals: గులాబిరేకులతో చర్మాన్ని కాంతివంతంగా ఎలా మార్చుకోవచ్చు..!

ABN , First Publish Date - 2024-02-07T16:44:32+05:30 IST

రోజ్ ఆయిల్ అనేది గులాబీ నుండి ఎక్కువగా ఉపయోగించే చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఒకటి.

Rose Petals: గులాబిరేకులతో చర్మాన్ని కాంతివంతంగా ఎలా మార్చుకోవచ్చు..!
Benefits of Rose

గులాబీలను ప్రేమకు చిహ్నంగా చూస్తాం. వీటితో చర్మ సంరక్షణలోనూ గులాబీలకు ప్రత్యేక స్థానం ఉంది. గులాబీ రేకులతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువ భాగం చర్మ సంరక్షణ పరిశ్రమలో ఉపయోగపడతాయి.. గులాబీ రేకుల నుండి తీసిన నూనె, నీరు చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ముఖ్య పదార్ధంగా ఉపయోగిస్తారు. ఎందుకంటే వాటిలో రిఫ్రెష్ లక్షణాలున్నాయి.. గులాబీలతో చర్మాన్ని రక్షించుకోవాలంటే..

గులాబీ రేకులు సువాసనలోనే కాదు చూడడానికి కూడా అందంగా ఉంటాయి. పురాతన ఈజిప్టులో రాయల్టీలను సంతోషపెట్టడానికి, వారి అందం ఆచారాలలో భాగంగా గులాబీలను ఉపయోగించేవారు. గులాబీ రేకులు ఇప్పటికీ స్నానాలలో ఎక్కువగా వాడుతున్నారు. ఎందుకంటే వాటి ప్రశాంతమైన సువాసన మైమరచేలా చేస్తుంది.

మనకు అందుబాటులో చాలా రకాల గులాబీలు ఉన్నాయి, కానీ గులాబీ నూనె, రోజ్ వాటర్ ఉత్పత్తిలో కేవలం నాలుగు రకాలు మాత్రమే ఉపయోగిస్తారు. ఈ నాలుగు రకాలు: రోసా డమాస్సేనా, రోసా సెంటిఫోలియా, రోసా గల్లికా, రోసా మోస్చాటా. ఈ నాలుగింటిలో, చర్మం కోసం రోసా డమాస్సేనాను ఎక్కువగా వాడతారు. అంతేకాకుండా, ఇది మంచి సువాసనతో ఉండి, ఈ రేకులు అత్యధిక నూనెను అందిస్తాయి. అందుకే ఈ రకాన్ని ఎక్కువగా వాడతారు.

రోజ్ వాటర్

రోజ్ వాటర్ అనేది గులాబీ రేకులు, నీటిని Distillation చేయడం ఉత్పత్తి అవుతుంది., ఇది చర్మ సంరక్షణ పరిశ్రమలో సువాసనకు ప్రసిద్ధి చెందింది. దీని వాసన మనస్సు, శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది. ఈ కారణాలతోనే దీనిని చాలా ఎక్కువగా వాడతారు.

ఇది కూడా చదవండి: జాపత్రి ఉపయోగాలేంటో తెలుసా..!


రోజ్ ఆయిల్

రోజ్ ఆయిల్ అనేది గులాబీ నుండి ఎక్కువగా ఉపయోగించే చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఒకటి. గులాబీ రేకుల ప్రయోజనాలలో అందంతోపాటు ఇది మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

రోజ్‌షిప్ సీడ్ ఆయిల్

రోజ్‌షిప్ సీడ్ ఆయిల్ రేకుల నుండి కాకుండా గులాబీ మొక్క పండ్ల నుండి సేకరిస్తారు. రోజ్‌షిప్ ఆయిల్ డ్యామేజ్ అయిన చర్మానికి మంచిది. ఇది నిగారింపును ఇస్తుంది. సున్నితత్వాన్ని అందిస్తుంది. తామర, చర్మ ఇబ్బందులు, సోరియాసిస్ వంటి వాటికి చికిత్స చేయడంలో సహాయపడుతుంది.

Updated Date - 2024-02-07T16:54:06+05:30 IST