Share News

Health Benefits : రక్తపోటును అదుపులో ఉంచే రాగులను ఉదయాన్నే తీసుకుంటే..!

ABN , Publish Date - Apr 06 , 2024 | 04:24 PM

బిపి, షుగర్ ఉన్నవాళ్లు రాగి జావ తీసుకోవడం వల్ల నియంత్రణలో ఉంటాయి. రాగులతో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాలేయ వ్యాధులు, గుండె బలహీనత,ఉబ్బసం వంటి సమస్యలు తగ్గాలంటే తరచూ రాగులని తీసుకోవాలి.

Health Benefits : రక్తపోటును అదుపులో ఉంచే రాగులను ఉదయాన్నే తీసుకుంటే..!
Weight Loss

రాగులు (Ragulu)పూర్వం నుంచి వస్తున్న అనేక ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలలో రాగులు కూడా ఒకటి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ రాగుల్ని రొట్టె, రాగి ముద్ద, జావ ఇలా చాలా రకాలుగా తయారుచేసి తీసుకుంటారు. దీనివల్ల రక్త హీనత తగ్గుతుంది. రాగి జావ చేసుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

బరువు తగ్గాలనుకునే వారు రాగులు తీసుకుంటే చాల మంచిది. వీటిలో ఉండే అమినో యాసిడ్స్, ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం కలిగి ఉండడం వల్ల ఆకలి తక్కువగా అనిపిస్తుంది. దీనితో తక్కువ తింటే సరిపోతుంది. ఇలా ఆటోమేటిగ్ గా బరువు తగ్గుతారు. అలానే రాగుల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కూడా ఆకలి అనిపించదు. రాగుల్లో (Ragulu) ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. అంతే కాదండి దీనివల్ల మలబద్ధక సమస్య తీరుతుంది.

బిపి, షుగర్ ఉన్నవాళ్లు రాగి జావ తీసుకోవడం వల్ల నియంత్రణలో ఉంటాయి. రాగులతో(Ragulu) రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాలేయ వ్యాధులు, గుండె బలహీనత,ఉబ్బసం వంటి సమస్యలు తగ్గాలంటే తరచూ రాగులని తీసుకోవాలి. రాగులతో చేసిన వాటిని తీసుకుంటే ఎముకలు దృఢంగా కూడా ఉంటాయి.

పోషకాలు.. రాగుల్లో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలున్నాయి. ఇవి ప్రోటీన్, అమైనో ఆమ్లాలను అందిస్తాయి.

రాగి సహజంగా గ్లూటెన్ రహితంగా ఉంటుంది. ఇది ఉదర కుహర వ్యాధఇని తగ్గిస్తుంది.

మెదడులోని నరాలను దెబ్బతిన్నట్లుగా గుర్తించే సంకేతాలు ఇవే...!


రాగుల్లో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఇవి డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది.

జుట్టుకు సహజంగా తయారు చేసుకున్న సిరమ్స్ ఎంతవరకూ మేలంటే..!

మధుమేహాన్ని నియంత్రిస్తుంది. రాగుల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

ఎముకల ఆరోగ్యానికి రాగులు చక్కగా పనిచేస్తాయి. ఇందులోని కాల్షియం, ఇతర ఖనిజాలు బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి సహకరిస్తాయి.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 06 , 2024 | 04:24 PM