Amazing Benefits Of Sprouts: అద్భుత ఫలితాలను ఇచ్చే మొలకల్ని ప్రతిరోజూ తీసుకుంటే..!
ABN , Publish Date - Jan 24 , 2024 | 11:57 PM
ఇంట్లో నీడలో మొలకలను నానిన తర్వాత ఆరనివ్వాలి. పెసలు, బ్రోకలీ, మెంతులు, ముల్లంగి, నట్స్ ని కలిపి తింటూ ఉంటారు. వీటి వల్ల శరీరానికి పోషకాలు కూడా అందుతాయి.
మంచి పోషకాలుండే ఆహారం తీసుకోవాలి. దీనికోసం సమతుల్యమైన ఆహారాన్ని ఎంచుకుంటే దానికి వ్యాయామాన్ని కూడా జోడిస్తేనే ఆరోగ్యానికి మంచి సపోర్ట్ ఇచ్చినట్టు. మనం ఎంచుకునే ఆహారం ఉదయాన్నే తీసుకునేదిగా ఉండాలి. ఎందుకంటే వ్యాయామం తర్వాత తీసుకోవడం వల్ల చక్కని జీర్ణక్రియ జరుగుతుంది. ఆరోగ్యానికి ఆకుకూరలతోపాటు పండ్లు కూడా సహాయపడతాయి. అలాగే ముఖ్యంగా మొలకెత్తిన గింజలను ఉదయాన్నే తీసుకోవడం మంచి ఆరోగ్యానికి మంచి ఎంపికగా ఉంటుంది. వీటిని నానబెట్టే విధానంలో కాస్త శ్రద్ధ కావాలి.
ఇంట్లో నీడలో మొలకలను నానిన తర్వాత ఆరనివ్వాలి. పెసలు, బ్రోకలీ, మెంతులు, ముల్లంగి, నట్స్ ని కలిపి తింటూ ఉంటారు. వీటి వల్ల శరీరానికి పోషకాలు కూడా అందుతాయి. ఒకరోజంతా నానిన గింజలను తీసి పొడి వస్త్రంలో మూటకింద కట్టి ఉంచడం వల్ల రెండో రోజునుంచి మొలకలు వస్తాయి. వీటిని ఉదయాన్నే తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి.
జీర్ణ శక్తికి మంచిది..
మొలకల వల్ల జీర్ణ శక్తికి మంచిది. అలాగే త్వరగా అరిగిపోతాయి. కడుపులోని కెమికల్ రియాక్షన్ కి కూడా ఇవి చక్కగా పనిచేస్తాయి. శరీరంలో ఉండే ఎంజైమ్స్ మనం తీసుకునే ఆహారాన్ని సరిగ్గా బ్రేక్ చేసి న్యూట్రియన్స్‌ని తీసుకుంటుంది. వీటితో పాటుగా మంచి ఫైబర్ ఉండే ఆహారం కూడా తీసుకోవాలి. కనుక వీటిని డైట్‌లో యాడ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల మంచి న్యూట్రీషియన్స్ శరీరానికి అందుతాయి.
బరువు తగ్గాలంటే..
రోజూవారి తీసుకునే ఆహారంలో మంచి నాణ్యత ఉన్న పండ్లు, కూరగాయలు, నట్స్, గింజలు ఉండేలా చూసుకోవాలి. వీటి కారణంగానే బరువు తగ్గడానికి వీలవుతుంది. కేవలం న్యూట్రియన్స్ మాత్రమే కాకుండా దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఏ రూపంలో తీసుకున్నా కూడా మొలకల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. క్యాలరీలు తక్కువగా ఉండే ఈ మొలకల్లో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పెసలు, మెంతులు తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గడానికి వీలవుతుంది.
రోగ నిరోధక శక్తి పెరిగేందుకు..
మొలకల్లో ఉండే విటమిన్స్, మినరల్స్ కారణంగా ఐరన్, కాపర్, మాంగనీస్, పొటాషియం కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి రెడ్ బ్లడ్ సెల్స్‌ని పెంచడానికి చేయడానికి ఉపయోగపడతాయి. బ్లడ్ ఫ్లోని కూడా ప్రమోట్ చేయడానికి ఉపయోగ పడతాయి. మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇది వైట్ బ్లడ్ సెల్స్ పెరుగుతాయి.