Share News

Health Benefits : గర్భధారణ సమయంలో రక్తపోటు స్థాయిలు తగ్గితే.. ప్లమ్ పండ్లు తింటే చాలట..!

ABN , Publish Date - Feb 19 , 2024 | 11:55 AM

ప్లమ్ పండ్లలో చాలా పోషకాలున్నాయి. అయితే వీటికి దగ్గరగా ఉండే మరో పండ్లు అలూ బుఖారా పండ్లు ఆకారంలో అచ్చం ప్లమ్ పండ్లలానే ఉన్నా రెండింటిలోనూ రుచి పరంగా చాలా తేడా ఉంది. అలాగే ఆరోగ్యప్రయోజనాలను అందివ్వడంలోనూ రెండు రకాల పండ్లలో చాలా వ్యత్యాసం ఉంది. అయితే ప్లమ్ పండ్లను ప్రపంచ వ్యాప్తంగా వీటిని డ్రై ఫ్రూట్స్ గా తింటూ ఉంటారు. తియ్యగా, గుజ్జుగా, ఎరుపు, బ్లూ కలర్స్ లో ఉండే ఈ పండ్లు ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలను అందిస్తాయి. అందులో ముఖ్యంగా...

Health Benefits : గర్భధారణ సమయంలో రక్తపోటు స్థాయిలు తగ్గితే.. ప్లమ్ పండ్లు తింటే చాలట..!
Plums

ప్లమ్ పండ్లలో చాలా పోషకాలున్నాయి. అయితే వీటికి దగ్గరగా ఉండే మరో పండ్లు అలూ బుఖారా పండ్లు ఆకారంలో అచ్చం ప్లమ్ పండ్లలానే ఉన్నా రెండింటిలోనూ రుచి పరంగా చాలా తేడా ఉంది. అలాగే ఆరోగ్యప్రయోజనాలను అందివ్వడంలోనూ రెండు రకాల పండ్లలో చాలా వ్యత్యాసం ఉంది. అయితే ప్లమ్ పండ్లను ప్రపంచ వ్యాప్తంగా వీటిని డ్రై ఫ్రూట్స్ గా తింటూ ఉంటారు. తియ్యగా, గుజ్జుగా, ఎరుపు, బ్లూ కలర్స్ లో ఉండే ఈ పండ్లు ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలను అందిస్తాయి. అందులో ముఖ్యంగా...

1. ప్లమ్ పండ్లలో ఖనిజాలు, పోటాషియం. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ వంటి వ్యధులను రాకుండా చర్మాన్ని కాపాడతాయి. అయితే వీటిలో కేలరీలు తక్కువ. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెంచవు.

2. ఈ పండ్లు మలబద్దకాన్ని తగ్గిస్తాయి. ఇందులోని ఫైబర్ ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. అలాగే క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. రక్తకణాలను పెంచి రక్త ప్రసరణను సరిగా జరిగే విధంగా చేస్తుంది.

3. వీటిని తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. గుండె పనితీరు మెరుగవుతుంది. రుచికి పుల్లగా ఎర్రగా ఉండే ఈ పండ్లలో పోషకాలు అనేకం ఉన్నాయి.

ఇది కూడా చదవండి: సంగీతం వింటూ ఒత్తిడిని తగ్గించుకోండిలా..!

4. గర్భధారణ సమయంలో తల్లితోపాటు, బిడ్డకు సరిపడా రక్త ప్రసరణ అవసరమవుతుంది. శరీరంలో సరిపడా రక్తం లేకపోవడం వల్ల అనీమియా వచ్చే అవకాశం ఉంది. దీనిని తగ్గించేందుకు రోజు వారి ఆహారంలో ప్లమ్ పండ్లను చేర్చుకోవం మంచిది.

5. అలసట ఎక్కువగా ఉన్న సమయాల్లో ఎనర్జీ లెవల్స్ పెరిగేందుకు కూడా ప్లమ్ పండ్లు సహకరిస్తాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం వల్ల ఉత్సాహంగా ఉంటారు.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే వెంటనే వైద్యులకు చూపించుకోవడం ఉత్తమం.

Updated Date - Feb 19 , 2024 | 11:56 AM