Share News

Queens of Millets : చిరుధాన్యాల వంగడాలను రక్షిస్తున్న గిరిజన రాణులు..

ABN , Publish Date - Feb 13 , 2024 | 04:02 PM

భారతదేశంలో మిల్లెట్ అంబాసిడర్స్‌గా ఒడిశా, మధ్య ప్రదేశ్, గిరిజన కమ్యూనిటీకి చెందిన ఈ మహిళలు మహిళా రైతులుగా పేరుపొందారు.

Queens of Millets : చిరుధాన్యాల వంగడాలను రక్షిస్తున్న గిరిజన రాణులు..
Queens of Millets

అరుదైన విత్తనాలను సేకరిస్తున్న స్త్రీలు వీరిద్దరూ.. మిల్లెట్స్ రాణులుగా పేరు పెందారు. ఒడిసాలోని కోరాపుట్ రైమతి ఘురియా అరుదైన ధాన్యాలను సేకరించి G20 సమ్మిట్ కు తీసుకువెళ్లింది. తన నైపుణ్యాలను ప్రపంచంతో పంచుకుంది. ఇక మరో మధ్య ప్రదేశ్‌కు చెందిన మహిళా రైతు లాహిరీ బాయి, అరుదైన మిల్లెట్ రకాలను కాపాడుతూ వస్తుంది. భారత దేశంలోనే మిల్లెట్ అంబాసిడర్‌గా ప్రశంసలు అందుకున్నారు. వీరిద్దరి గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.

భారతదేశంలో మిల్లెట్ అంబాసిడర్స్‌గా ఒడిశా, మధ్య ప్రదేశ్, గిరిజన కమ్యూనిటీకి చెందిన ఈ మహిళలు మహిళా రైతులుగా పేరుపొందారు. సేంద్రియ రైతులుగా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ గా శిక్షణ ఇస్తున్నారు. కోరాపుట్ జిల్లాలో సాంప్రదాయ వరి, చిరుధాన్యాలు, వంగడాలను సంరక్షిస్తున్నారు.

రైమతి..

కుంద్రా బ్లాక్‌లోని నౌగూడ గ్రామానికి చెందిన రైమతి తన భర్త గోబింద ఘియురియా, ముగ్గురు పిల్లలతో కలిసి నివాసముంటుంది. సేంద్రియ వ్యవసాయానికి కట్టుబడి వ్యవసాయం చేస్తూ, అందులోనే ఎంతో గుర్తింపును తెచ్చుకుంది. రైమతి తనలాంటి 2500 మంది సహచర రైతులకు శిక్షణ ఇచ్చింది. సేంద్రీయ పద్ధతుల ప్రాముఖ్యతను అందరికీ తెలిసే విధంగా చెబుతుంది. రైమతి శిక్షణలో SRI (వరి ఇంటెన్సిఫికేషన్ వ్యవస్థ), వరి సాగు కోసం లైన్ మార్పిడి, ఫింగర్ మిల్లెట్‌ల కోసం SMI (సిస్టెమ్ ఆఫ్ మిల్లెట్ ఇంటెన్సిఫికేషన్), LT (లైన్ ట్రాన్స్‌ప్లాంటింగ్) పద్ధతులు లాంటివి తెలియజేస్తుంది.

ఆమె నైపుణ్యాన్ని గుర్తించిన ఒడిసా లైవ్లీహుడ్ మిషన్ ఆమెను ఎక్స్ టర్నల్ లైవ్లీహుడ్ సపోర్ట్ పర్సన్‌గా నియమించింది. రైమతిని ఇతర ప్రాంతాలకు రిసోర్స్ పర్సన్‌గా పంపిస్తుంది. తన భూమిలో పండిన వరి, మినుముల గురించి సాగు విధానాల గురించి వివరిస్తుంది.. సాంప్రదాయ భూముల పరిరక్షణ, స్థానిక జన్యు వనరుల సంరక్షణపై రైతులకు అవగాహన కల్పిస్తోంది. రైమతి ఇప్పటి వరకూ 72 సాంప్రదాయ వరి రకాలను, 30 రకాల చిరుధాన్యాలను సేకరించింది.

ఇది కూడా చదవండి: ఈ చెట్టులో ప్రతి భాగం ఉపయోగకరమే..! బాబాబ్ చెట్టుతో ఎంత ఆరోగ్యమంటే..


లాహిరీ..

మధ్యప్రదేశ్‌కు చెందిన బైగా తెగ మహిళ లాహిరీ బాయి. భారతదేశంలోనే మిల్లెట్ అంబాసిడర్‌గా ప్రశంసలు అందుకుంది. దాదాపు మూడు ఎకరాల భూమి, సిల్పిడి గ్రామంలో మిల్లెట్ రకాలను అంతరించిపోకుండా కాపాడుతుంది. లాహిరీ తన ప్రయత్నాల ద్వారా 150 కంటే తక్కువ దేశీయ మిల్లెట్ రకాలను కాపాడింది.

2022లో తన జిల్లాలోని 25 గ్రామాలకు 350 మంది రైతులకు విత్తనాలను పంపిణీ చేసింది. లాహిరీ విత్తన సాగు, ఆహార పద్దతులపై ఆమె చూపే శ్రద్ధ ఆమెకు ఎంతో గుర్తింపును తెచ్చాయి. దీనితోనే 40 మంది మహిళా రైతులు లాహిరీని మినుములతో పాటు, చారిత్రాత్మకంగా బైగా ప్రజలు తినే వంగడాలపై, పుప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల పంటలపై దృష్టి సారించారు.

Updated Date - Feb 13 , 2024 | 04:02 PM