Share News

Summer : వేసవిలో వేధించే ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌కు కారణాలు ఏంటో తెలుసా..!

ABN , Publish Date - Apr 20 , 2024 | 04:19 PM

ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ షవర్లు, లాకర్ గదులు, బహిరంగ ప్రదేశాలలో ఉంటుంది. చర్మంలో గాయం ఏర్పడినప్పుడు కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ సులభంగా వ్యాపిస్తుంది. కొన్ని యాంటీ బయాటిక్స్ ఫంగల్ పెరుగుదలను తగ్గిస్తాయి.

Summer : వేసవిలో వేధించే ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌కు కారణాలు ఏంటో తెలుసా..!
Fungal infections

వేసవిలో చెమట పొక్కులతో పాటుగా చికాకుపెట్టే మరో సమస్య ఫంగల్ ఇన్ఫెక్షన్ (fungal infection), ఇది అందరికీ సంక్రమిస్తుంది. గాలి ద్వారా ముఖ్యంగా సోకుతుంది.గాలిలో ఉండే శిలీంధ్రాల కారణంగా, ఊపిరి పీల్చుకున్నప్పుడు కూడా ప్రభావితం కావచ్చు, అలాగే బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ (fungal infection) సమస్య పెరుగుతుంది. ముఖ్యంగా తేమ, వెచ్చని ఉష్ణోగ్రతలలో ఈ ఫంగస్ పెరుగుతుంది. ఈ అంటు వ్యాధులు ఎవరికైన సోకే వచ్చు. ఇది ప్రమాదం మాత్రం కాదు. ఈ ఫంగస్ సోకినపుడు ఉండే లక్షణాల గురించి తెలుసుకుందాం

CDC ప్రకారం, శిలీంధ్రాల ద్వారా కలిగే ఇబ్బందులను అంటువ్యాధులు అంటారు. సాధారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ (fungal infection) అంటే దురద ఉంటుంది. అలాగే జననేంద్రియాలలో కాన్డిడియాసిస్ ఇబ్బందులు ఉంటాయి.

1. లక్షణాలు..

పుండ్లు,

దద్దుర్లు

దురద

రంగు మారిన గోళ్లు

నోటి దగ్గర తెల్లటి మచ్చలు

High cholesterol : ఈ లక్షణాలు గమనిస్తే ఇట్టే చెప్పచ్చు.. పురుషుల్లో అధిక కొలెస్ట్రాల్ ఉందని.. అవేమిటంటే..!

2. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తిలో ఇటువంటి ఇబ్బందులు..

జ్వరం

అలసట

కండరాల నొప్పులు

శ్వాస ఆడకపోవడం

తలనొప్పి

కీళ్ళ నొప్పులు

చమటలు పట్టడం


3. సంక్రమణకు కారణం అయ్యే ఫంగల్ ఇన్ఫెక్షన్లు(fungal infection) ఇవి..

డెర్మటోఫైట్స్

కాండిడా

శిలీంధ్రాలు

1. డెర్మాటోఫైట్స్.. జుట్టు, గోర్లు, చర్మం బయటి పొరలలో ఇవి నివసిస్తాయి.

2. కాండిడా అల్బికాన్స్.. ఇది ఈస్ట్ జీవి. ఈ జీవి మానవులతో సహజీవనం చేస్తుంది. ఈ జీవి శరీరం మీద పెరిగినపుడు దురద, ఎరుపు వంటి ఇబ్బందులు కలుగుతాయి. ఇది హానికరం కాదు.

3. శిలీంధ్రాలు.. సాధారణంగా నేల, నీటిలో కనిపిస్తుంది. కొన్ని శిలీంధ్రాలలో ఆస్పర్ గిల్లస్, బ్లాస్టోమైసెస్..

ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ షవర్లు, లాకర్ గదులు, బహిరంగ ప్రదేశాలలో ఉంటుంది. చర్మంలో గాయం ఏర్పడినప్పుడు కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ సులభంగా వ్యాపిస్తుంది. కొన్ని యాంటీ బయాటిక్స్ ఫంగల్ పెరుగుదలను తగ్గిస్తాయి.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 20 , 2024 | 04:25 PM