Yogasanas : ఆహారం సులభంగా జీర్ణం కావడానికి ఈ ఆసనాలు వేస్తే చాలు..!
ABN , Publish Date - Mar 01 , 2024 | 03:10 PM
రోజువారి ఒత్తిడిని తగ్గించుకునేందుకు, మానసిక ప్రశాతతను పొందేందుకు ఆసనాలు మెదడుకు, శరీరానికి ప్రశాంతతను ఇస్తాయి. కొన్ని ఆసనాలతో మెదడు, శరీరం రిలాక్స్ కావడమే కాదు. జీర్ణక్రియను కూడా సులభతరం చేసే విధమైన కొన్ని ఆసనాలున్నాయి. వాటిని ప్రతి రోజూ వేయడం వల్ల అనేక ప్రయోజనాలు.
రోజువారి ఒత్తిడిని తగ్గించుకునేందుకు, మానసిక ప్రశాతతను పొందేందుకు ఆసనాలు మెదడుకు, శరీరానికి ప్రశాంతతను ఇస్తాయి. కొన్ని ఆసనాలతో మెదడు, శరీరం రిలాక్స్ కావడమే కాదు. జీర్ణక్రియను కూడా సులభతరం చేసే విధమైన కొన్ని ఆసనాలున్నాయి. వాటిని ప్రతి రోజూ వేయడం వల్ల అనేక ప్రయోజనాలు. ముందుగా..
బాలాసన..
రోజూరోజుకీ మనిషికి పెరుగుతున్న ఒత్తిడిని అదుపులో ఉంచేందుకు యోగా చక్కని మార్గం. ఇది ఏకాగ్రతను పెంచి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. బాలాసన లేదా పిల్ల భంగిమ.. ఇందులో ఆందోళన తగ్గుతుంది. అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మహిళలకు నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులు కూడా ఈ ఆసనం వేయడం వల్ల తగ్గుతాయి.
పశ్చిమోత్తానాసనం..
ఈ భంగిమ వల్ల వెన్నెముకను పైకి వంచి చేలే ఆసనం కాబట్టి దీనికి పశ్టిమోత్తానాసనం అతి ముఖ్యమైన యోగాసనాలలో ఇది ఒకటి. పశ్చిమం అంటే వీపు, శరీరం వెనుకభాగం అని అర్థం. వీపు భాగాన్ని లేపి మందుకు వంచడం వల్ల ఆ పేరు వచ్చింది.
భరద్వాజసనం..
ఈ సున్నితమైన విశ్రాంతి భంగిమ మనస్సును శాంతపరచడానికి, రక్తప్రవాహాన్ని పెంచడానికి, జీర్ణక్రియను పెంచేందుకు సహకరిస్తుంది.
అధోముఖ స్వనాసన..
ఈ భంగిమ వెన్నెముక, పొత్తికడుపుతో సహా మొత్తం శరీరాన్ని సాగదీయజానికి సహకరిస్తుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలకు ఉపశమనాన్ని కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి; మద్యపానం వల్ల మెదడులో ప్రభావితమయ్యే ఐదు ప్రాంతాలివే..!
సేతు బంధాసనం..
వంతెన భంగిమలో ఛాతీ, మెడ, వెన్నెముకను వంచాలి. ఉదరానికి రక్త ప్రవాహాన్ని పెంచడంలో జీర్ణ అవయవాలను ఉత్తేజపరుస్తుంది.
ఉత్తానాసనం..
ఈ భంగిమ పొత్తికడుపును బిగిబెడుతుంది. ఇది జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. అలాగే ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.
ఇది కూడా చదవండి: కర్బూజాతో కలిగే ఐదు ఆరోగ్యప్రయోజనాలివే..!
సంబంధిత వార్తలు : లేటు వయసులో గర్భధారణ వల్ల ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయి..
పవనముక్తాసన..
ఈ భంగిమ కడుపును బిగబెట్టి ఉంచడం వల్ల జీర్ణ క్రియను పెంచుతుంది. ఇది గ్యాస్, ఉబ్బరం ఉపశమనం పొందడంలో సహకరిస్తుంది. విలోమం ప్రసరణను వెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహకరిస్తుంది. జీర్ణక్రియను ఈ ఆసనాలన్నీ పెంచుతాయి.
మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.