Share News

cockroaches : బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఈ ట్రిప్స్ ట్రై చేయండి..!

ABN , Publish Date - Mar 28 , 2024 | 03:33 PM

వేప ఆకులతో బొద్దింకలను తరిమికొట్టవచ్చు. ఇంటి నుంచి బొద్దింకలను వదిలించుకోవాలనుకుంటే, వేప చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

cockroaches : బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఈ ట్రిప్స్ ట్రై చేయండి..!
cockroaches

బొద్దింకల (cockroaches) సమస్య ప్రతి ఇంటి సమస్యా.. దాదాపు ప్రతి ఇంట్లోనూ బొద్దింకలు ఉంటాయి. ఇవి అక్కడా ఇక్కడా అని కాకుండా ప్రతి చోటా కనిపిస్తూనే ఉంటాయి. వీటినుంచి తప్పించుకోవడం కూడా కష్టమే. ఇంట్లో బొద్దింకలు కనిపించగానే కంగారు పడకుండా కెమికల్స్ ఉపయోగించినా కూడా ఇది మరో సమస్యకు కారణం అవుతుంది. ఇలా కెమికల్స్ ద్వారా చనిపోతున్న బొద్దింకలు మరో స్థలానికి వెళ్లి పడతాయి. అక్కడ నుంచి మరో సమస్య మొదలవుతుంది. అదే చిన్న చిన్న ఇంటి చిట్కాలతో బొద్దింకల బెడదను వదుల్చుకుంటే మరో సమస్యా రాదు. దీనికోసం చేయాల్సిన పనేమిటంటే..

బొద్దింకలు..

బొద్దింకలు ఎక్కువగా అటు వేడి ఇటు చల్లదనం ఉన్న ప్రదేశంలో కాకుండా మధ్య లో ఉండే ప్రదేశాలను ఎంచుకుంటాయి. అలానే ఎక్కువగా ఆహారం దొరికే ప్రదేశాలలో అవి ఉంటాయి. తినే ఆహారం మీదకి కూడా అవి వచ్చేస్తూ ఉంటాయి. దీనితో కొత్త అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.

తేమతో కూడిన వాతావరణం ఉన్నచోట బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి. అలాగే

తిన్న ప్లేట్లను కడిగి,. మిగిలిపోయిన ఆహారాన్ని వెంటనే బయట పడేయాలి.

ఇంట్లో చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి.

చెత్తకు ఉపయోగించే డబ్బాలను ఆరుబయట ఉండేలా చూసుకోవాలి.

రాత్రి వేళలో బొద్దింకలు కిటికీలు, తలుపులను మూసివేయాలి.

అట్ట పెట్టెలను ఎక్కువగా బొద్దింకలు చేరుతూ ఉంటాయి. కాబట్టి ఇంట్లో అనవసరమైన పెట్టెలను ఎప్పటికప్పుడు పడేస్తూ ఉండాలి.


ఇవి కూడా చదవండి: అధిక బరువు తగ్గించే శాకాహారం.. రోజూ తీసుకుంటే .!

ఈ పండు రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుందట...!

వేసవిలో వికసించే ఈ పూలమొక్క.. మొత్తం తోటకే అందాన్ని తెస్తుంది.. వీటిలో..

ఉల్లిపాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా..!

బొద్దింకల నుంచి ఉపశమనం..

వేప ఆకులతో బొద్దింకలను తరిమికొట్టవచ్చు. ఇంటి నుంచి బొద్దింకలను వదిలించుకోవాలనుకుంటే, వేప చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. 2 నుంచి 3 కప్పుల వేప ఆకులను నీటిలో వేసి మరిగించాలి. ఈ నీటిని బొద్దింకలు ఉన్న ప్రాంతాలలో చల్లడం వల్ల బొద్దికల తగ్గుతాయి.

బేకింగ్ సోడా చాలా ప్రభావవంతంగా..

బొద్దింకలను వదిలించుకోవడానికి బేకింగ్ సోడా కూడా బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం బేకింగ్ సోడాలో పంచదార మిక్స్ చేసి మిశ్రమంలా చేసుకోవాలి. ఆ తర్వాత బొద్దింక ఉన్న ప్రదేశంలో దీనిని చల్లాలి. క్రమంగా బొద్దింకలు తగ్గుతాయి.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Mar 28 , 2024 | 03:33 PM