Share News

Ugadi : ఆరు రుచులలో ఎంత ఆరోగ్యం దాగున్నదంటే.. ఉగాది పచ్చడి రుచి మళ్లీ మళ్ళీ రాదు..!

ABN , Publish Date - Apr 09 , 2024 | 11:38 AM

ఈ రుచులతో జీవితమే కాదు, ఆరోగ్యం కూడా పండాలనే ఉద్దేశ్యంతోనే సంవత్సరంలో మొదటిగా వచ్చే చింతపండు, మిరప, మామిడి, వేప పూత వంటి పదార్థాలను కలిపి ఈ పచ్చడిని తయారుచేస్తారు, ఇవి జీవిత సుఖదుఃఖాలను పంచుకునే విధంగానే కాదు.. ఆరోగ్యాన్ని పెంచుకుందుకు కూడా ఉపయోగపడతాయని తెలుపుతున్నాయి.

Ugadi : ఆరు రుచులలో ఎంత ఆరోగ్యం దాగున్నదంటే.. ఉగాది పచ్చడి రుచి మళ్లీ మళ్ళీ రాదు..!
Ugadi

ఉగాది అనగానే మొదటగా గుర్తుకువచ్చేది ఆరురుచులు కలిపిన ఉగాది పచ్చడి. ఈ రుచులు మళ్ళీ మళ్ళీ తినాలన్నా అచ్చం అదే కమ్మదనంతో ఆ ఏడాదిలో కుదరకపోవచ్చు. అయితే ఈ పచ్చడిలో ఉపయోగించే ఆరు రుచులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటిని అన్నింటినీ కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి చాలా మంచిది. ఈ ఆరు రుచులలో దాగున్న ఆరోగ్య గుణాలను గురించి తెలుసుకుందాం.

ఉగాది పచ్చడి తయారిలో ఉపయోగించే తీపి, పులుపు, కారం, చేదు, వగరును రుచిని పెంచుతాయి. ముఖ్యంగా జీవితంలోని ప్రతి విషయంలో ఈ షడ్రుచులూ భాగం అయి ఉంటాయనే దానికి ప్రతీకగా ఉగాది పచ్చడిని తినిపిస్తారు. కష్టసుఖాలను సమపాళ్ళలో తీసుకునే విధంగా ఉండాలని చెబుతుంది. ఈ ఉగాది.

ఒక్కో రుచి ఒక్కో అనుభూతిని ఇస్తుంది. తొలి పండుగగా పిలుచుకునే ఉగాది తెలుగువారికి కొత్త సంవత్సరం ఆరంభం. ఇది చాలా ప్రత్యేకమైనది. ఈరోజుతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతాం. ఉగాదిలో షడ్రుచుల రుచి చూడాలి. ఆ రుచులు జీవితంలోని కోణాల గురించి చెబుతాయి. అందుకే ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచులను కలుపుతారు.

బెల్లం..

ఇందులోని బెల్లానికి రక్తహీనతను తగ్గించే గుణం ఉంది.

ఐరన్ అధికంగా ఉంటుంది.

త్వరగా జీర్ణం కావడానికి సహకరిస్తుంది.

చింతపండు..

సహజమైన వగరు, పులుపు రుచి, ఇందులోని మెగ్నీషియం బీపీని తగ్గిస్తుంది.

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి.

డయాబెటీస్ ను కంట్రోల్ చేస్తుంది.

ఇందులోని ఫ్లేవనాయిడ్లు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.


రాగి సీసాలో నీటిని ప్రతిరోజూ తీసుకుంటే ..!

వేప..

వేపలో రక్తం శుద్ధి చేసే గుణాలున్నాయి.

శరీరంలో టాక్సిన్లను తొలగిస్తుంది.

మధుమేహాన్ని అదుపు చేస్తుంది.

మిరప..

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి.

శ్వాసవ్యవస్థకు ఉపశమనాన్ని అందిస్తుంది.

లవణం,

ఉప్పులో సోడియం అధికంగా ఉంటుంది.

శరీరంలో నీటి శాతాన్ని కాపాడుతుంది,

మెదడు పనితీరును సరి చేస్తుంది.

లైట్ థెరపీ శరీరంలో చాలా మార్పులకు ఇది అవసరం.. ముఖ్యంగా నిద్రకు..!

మామిడి..

శరీరం డీహైడ్రేషన్ బారినపడకుండా చేస్తుంది.

వికారం వాంతులు వంటి లక్షణాలు ఉండవు.

ఈ రుచులతో జీవితమే కాదు, ఆరోగ్యం కూడా పండాలనే ఉద్దేశ్యంతోనే సంవత్సరంలో మొదటిగా వచ్చే చింతపండు, మిరప, మామిడి, వేప పూత వంటి పదార్థాలను కలిపి ఈ పచ్చడిని తయారుచేస్తారు, ఇవి జీవిత సుఖదుఃఖాలను పంచుకునే విధంగానే కాదు.. ఆరోగ్యాన్ని పెంచుకుందుకు కూడా ఉపయోగపడతాయని తెలుపుతున్నాయి.

Updated Date - Apr 09 , 2024 | 11:38 AM