Share News

Health benefits of peach : పీచ్ టీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..!

ABN , Publish Date - Feb 19 , 2024 | 02:24 PM

పీచ్ టీ.. కొత్తగా అనిపించినా పీచ్ పండ్లతో వేసవిలో పానీయం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలున్నాయి. పీచ్ టీని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా రకాల పోషకాలందుతాయి. పీచ్ టీని ప్రూనస్ పెర్సికా ఆకులతో పండ్లతో తయారు చేస్తారు. బ్లాక్ పీచ్ టీ బ్యాగ్ లలో ఎండిన ముక్కలు, పండ్ల పీల్స్ కూడా ఉంటాయి. ఈ పీచ్ టీని దాదాపు 8000 సంవత్సరాల క్రితం చైనాలో తీసుకునేవారు. ప్రపంచంలోని పీచ్ టీ సరఫరా ఒక్క చైనా లోనే ఎక్కువగా జరుగుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

Health benefits of peach : పీచ్ టీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..!
peach tea

పీచ్ టీ.. కొత్తగా అనిపించినా పీచ్ పండ్లతో వేసవిలో పానీయం తీసుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. పీచ్ టీని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి చాలా రకాల పోషకాలందుతాయి. పీచ్ టీని ప్రూనస్ పెర్సికా ఆకులతో, పండ్లతో తయారు చేస్తారు. బ్లాక్ పీచ్ టీ బ్యాగ్ లలో ఎండిన ముక్కలు, పండ్ల పీల్స్ కూడా ఉంటాయి. ఈ పీచ్ టీని దాదాపు 8000 సంవత్సరాల క్రితం చైనాలో తీసుకునేవారు. ప్రపంచంలోని పీచ్ టీ సరఫరా ఒక్క చైనా లోనే ఎక్కువగా జరుగుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

పురాతన చైనీస్, జపనీస్ సంస్కృతులలో పీచెస్ మానవ శరీరానికి అవసరమైన విటమిన్ సి 15 % వరకూ అందిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. పీచ్ పండ్లలో బ్లాక్స లేదా గ్రీన్ టీ రెండు ఫ్లేవర్స్ లోనూ దొరుకుతాయి. దీనితో ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలుంటాయంటే..పీచ్ పండ్ల రుచి, పీచ్ పండ్ల గుజ్జుతో తయారు చేస్తారు. దీనిలో అనేక రకాల గుణాలున్నాయి.

చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది..

పీచెస్‌లో చాలా పోషకాలున్నాయి. అలాగే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి పొడిబారకుండా నిరోధించడంలో, చర్మాన్ని హైడ్రేట్‌గా ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి.

గుండె ఆరోగ్యానికి మంచిది..

పీచెస్ రక్తపోటును, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

క్యాన్సర్ ను నివారిస్తుంది..

పీచెస్ లో కెరోటినాయిడ్స్, కెఫిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగి ఉన్నాయి.

అలెర్జీని తగ్గిస్తుంది..

రక్తంలో హిస్టమైన్ ఉత్పత్తిని నిరోధించి, పీచెస్ అలెర్జీ లక్షణాలను తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి: నెల ఆధారంగా ప్రతి నెలను సూచించే పుష్పం ఏంటో తెలుసా..!


మెరుగైన జీర్ణక్రియ..

ఇందులోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థ ద్వారా ఆహారాన్ని సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది.


రోగనిరోధక శక్తిని పెంచుతుంది..

పీచులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది..

పీచెస్ లో ఉండే సమ్మేళనాలు రక్తంలో చెక్కెర పెరుగుదలను, ఇన్సులిన్ నిరోధకతను నిరోధిస్తుంది.

కంటి చూపును రక్షిస్తుంది..

పీచెస్ కంటి లెన్స్, రెటీనాను రక్షించడంలో సహాయపడే లుటిన్, జియాక్సంతిన్ అనే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇవి మాక్యులర్ డీజెనరేషన్, కంటిశుక్లం ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే వెంటనే వైద్యులకు చూపించుకోవడం ఉత్తమం.

Updated Date - Feb 19 , 2024 | 03:15 PM