Share News

Food : గుడ్డు Vs పనీర్ ఏది బెస్ట్? ఆరోగ్యానికి, బరువు తగ్గేందుకు ఏది సపోర్ట్‌గా నిలుస్తుంది..?

ABN , Publish Date - Apr 13 , 2024 | 01:06 PM

ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో ఉండే పోషకాహారం. ఒక ఉడికించిన గుడ్డులో(boiled egg) సుమారు 44గ్రాముల పోషకాలు ఉంటాయి. 5.5గ్రాముల ప్రొటీన్, 4.2 గ్రాముల కొవ్వు ఉంటుంది. కొలెస్ట్రాల్, జింక్, సెలీనియం, పొటాషియం, భాస్వరం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి ఇతర ఖనిజాలు ఉంటాయి.

Food : గుడ్డు Vs పనీర్ ఏది బెస్ట్? ఆరోగ్యానికి, బరువు తగ్గేందుకు ఏది సపోర్ట్‌గా నిలుస్తుంది..?
protein

మనం తీసుకునే ఆహారం మూలంగానే మన శరీరం దృఢంగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా శరీరానికి బలాన్నిచ్చే పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. ఉదయాన్నే గుడ్లు, పాలు తీసుకోవడం బలాన్ని ఇస్తాయని నమ్ముతాం. అలాగే పాల ఉత్పత్తులు కూడా బలాన్ని అందిస్తాయని నమ్ముతాం. వీటిని తీసుకోవడం శరీరానికి ఏ విధంగా సహాయపడతాయి. గుడ్లు, పన్నీరు ఏది బెస్ట్ టేస్ట్, లేదా పోషకాలు కలిగి ఉంది. అదే తెలుసుకుందాం.

గుడ్డు(eggs) : అల్పాహారంగా తీసుకునే ఒక గుడ్డు 6-7 గ్రాముల ప్రోటీన్‌ను కలిగి ఉంటుంది, ఇది అనుకూలమైన, కాంపాక్ట్ ప్రోటీన్ మూలంగా మారుతుంది. శరీరానికి కావాల్సిన ప్రోటీన్ తో పాటు, అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. గుడ్లు సెలీనియం వంటి ఖనిజాలతో పాటు B12, D, కోలిన్ వంటి విటమిన్లను కలిగి ఉంటుంది.

పనీర్(panner): ఈ క్రీమీ కాటేజ్ చీజ్ 100గ్రా సర్వింగ్‌కు దాదాపు 18 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటుంది. ఇది మాంసం లేకుండా ప్రోటీన్‌ను అందిస్తోంది. అదనంగా, పనీర్ కాల్షియం, ఫాస్పరస్, B విటమిన్లను అందిస్తుంది, బలమైన ఎముకలు, మొత్తం ఆరోగ్యానికి చేస్తుంది.

మొక్కల ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయవచ్చు.. వీటిలో ముఖ్యంగా..

గుడ్లు(eggs) ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో ఉండే పోషకాహారం. ఒక ఉడికించిన గుడ్డులో(boiled egg) సుమారు 44గ్రాముల పోషకాలు ఉంటాయి. 5.5గ్రాముల ప్రొటీన్, 4.2 గ్రాముల కొవ్వు ఉంటుంది. కొలెస్ట్రాల్, జింక్, సెలీనియం, పొటాషియం, భాస్వరం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి ఇతర ఖనిజాలు ఉంటాయి. ఈ విధంగా చూస్తే గుడ్ల ద్వారా శరీరానికి కావలసిన అన్నిరకాల విటమిన్లు, పోషకాలను సులువుగా పొందవచ్చు. చాలామంది గుడ్డు పచ్చసొనలో కొవ్వుపదార్థం ఎక్కువగా ఉంటుందని దాన్ని వదిలేస్తుంటారు. కానీ పచ్చసొనలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. వ్యాయామం చేసేవారు గుడ్లను తప్పనిసరిగా తమ డైట్‌లో చేర్చుకోవడం చూడచ్చు.

పాల నుండి లభించే పనీర్(panner) ధర విషయంలో గుడ్లతో పోలిస్తే ఎక్కువే. కానీ శాకాహారులు(vegetarians) బరువు తగ్గాలని అనుకుంటే పనీర్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. పైగా పనీర్ లో గుడ్డు కంటే తక్కువ కొవ్వు ఉంటుంది. దీని వల్ల శరీరానికి అందే కేలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. పనీర్ లో 7.54గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. విటమిన్ బి12, రిబోప్లోవిన్, విటమిన్ డి, సెలీనియం వంటివి ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో అవసరమైనది. పనీర్, గుడ్లు రెండూ బరువు తగ్గడంలో( weight loss) సహాయపడినా గుడ్ల కంటే పనీర్ లో తక్కువ కేలరీలు లభిస్తాయి. కానీ ధర పరంగా గుడ్లు చవక, పనీర్ ఖరీదు.


ఈ మృదువైన, కొబ్బరి మలై తింటే ఎన్ని బెనిఫిట్స్ అంటే.. మీరు అస్సలు ఊహించరు..!

పనీర్ ను కూడా సలాడ్ ల దగ్గర నుండి కూరల వరకు ఎన్నో విధాలుగా తీసుకోవచ్చు. పనీర్ ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది, పైగా నెమ్మదిగా జీర్ణం అవుతుంది. కాబట్టి ధర విషయంలో పర్వాలేదు అనుకునే వారు పనీర్ ను తీసుకోవడం మంచిది. తక్కువ ధరలో ప్రొటీన్ ఫుడ్ కావాలని అనిపిస్తే గుడ్లకు ఓటెయ్యచ్చు. పనీర్, గుడ్లు తీసుకుంటే ఏవైనా అలెర్జీలు ఉంటే మాత్రం వాటికి ప్రత్యామ్నాయంగా పెసలు, రాజ్మా, బ్రోకలి, బ్లాక్ బీన్స్ వంటివి తీసుకోవడం మంచిది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 13 , 2024 | 01:19 PM