Share News

Buttermilk : మజ్జిగను తీసుకుంటే కడుపులో చల్లని ఫీలింగ్ కలుగుతుంది.. వేసవిలో ఇలా ట్రై చేయండి.

ABN , Publish Date - Apr 08 , 2024 | 01:44 PM

మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఎక్కువసేపు అలాగే ఉంచితే పుల్లగా, చేదుగా మారుతుంది. ఈ మజ్జిగను ఎక్కువ కాలం వాడకూడదు. మజ్జిగ ఈరోజు చేస్తే రేపటి వరకు వాడుకోవచ్చు. ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటే, ఫ్రిజ్‌లో ఉంచవచ్చు

Buttermilk : మజ్జిగను తీసుకుంటే కడుపులో చల్లని ఫీలింగ్ కలుగుతుంది.. వేసవిలో ఇలా ట్రై చేయండి.
Buttermilk

వేసవిలో మజ్జిగ తాగితే దాహం కట్టేస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే.. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కాస్త కొత్తగా ట్రై చేయండి. ఈ రుచి కూడా మామూలు మజ్జిగలానే నచ్చుతుంది. వేసవిలో రోజుకు ఒక గ్లాసు మజ్జిగ రెండు పూటలా తీసుకుంటే కడుపులో చల్లని ఫీలింగ్ కలుగుతుంది.. ఈ మజ్జిగను అనేక రుచుల్లో తయారు చేసుకోవచ్చు. మొత్తం 3 రకాల మజ్జిగలు ఎలా చేయాలో చూద్దాం.

మజ్జిగను అనేక రకాలుగా తయారు చేసుకోవచ్చు, పెరుగులో నిమ్మరసం కలిపి మజ్జిగ తయారు చేస్తారు. ఇది అంతా చేసుకునే మామూలు పద్దతి.

జీలకర్ర మజ్జిగ తయారీ విధానం

2 కప్పుల పెరుగు, 2 కప్పుల నీరు, నల్ల ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి 2 టేబుల్ స్పూన్లు, 1 తరిగిన పచ్చిమిర్చి, కావాలనుకుంటే కొన్ని కొత్తిమీర ఆకులు తీసుకోవాలి.

గట్టి పెరుగును గిన్నెలో వేసి నీళ్లు పోసి చేత్తో చేసుకోవచ్చు. లేదా మిక్సీలో వేయవచ్చు.. ఈ మజ్జిగ నీళ్లలో జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి కలిపితే మజ్జిగ రెడీ. తాగేందుకు రుచిగా ఉంటుంది. జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి.

అల్లం మజ్జిగ

1 టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసం తీసుకోవాలి. 2 కప్పుల పెరుగు, కొత్తిమీర 1 అంగుళం అల్లం, ఉప్పు, నీరు , ఈ పదార్థాలన్నీ మిక్సీలో వేసి రెండు రౌండ్లు తిప్పితే అల్లం మజ్జిగ రెడీ.

ఆరోగ్యకరమైన స్నాక్స్ రాత్రి 8 తర్వాత కూడా తిసుకోవచ్చు..!

కొత్తిమీర మజ్జిగ

1 కప్పు పెరుగు, 2 పుదీనా ఆకులు, 1 అంగుళం అల్లం, 1/2 టీస్పూన్ ధనియాలు, కొత్తిమీర తీసుకోవాలి. పెరుగు, అల్లం, వేసి మెత్తగా చేయాలి. ఆపై వేధనియాల పొడి, కొత్తిమీర కలిపితే మజ్జిగ రెడీ అయినట్టే.

మజ్జిగ ఉపయోగం..

మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఎక్కువసేపు అలాగే ఉంచితే పుల్లగా, చేదుగా మారుతుంది. ఈ మజ్జిగను ఎక్కువ కాలం వాడకూడదు. మజ్జిగ ఈరోజు చేస్తే రేపటి వరకు వాడుకోవచ్చు. ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటే, ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. కానీ చాలా రోజులు పెట్టుకుని మాత్రం తాగకూడదు. మజ్జిగ చెడిపోతే వాసన పుల్లగా, దుర్వాసన, రంగు మారుతుంది. ఇది అనారోగ్యాన్ని పెంచుతుంది.


జుట్టుకు సహజంగా తయారు చేసుకున్న సిరమ్స్ ఎంతవరకూ మేలంటే..!

మజ్జిగ ప్రయోజనాలు

మజ్జిగ మజ్జిగ ఎసిడిటీని తగ్గిస్తుంది. కడుపులోని ఆమ్లతను తగ్గిస్తుంది. భోజనం తిన్న తర్వాత తరచుగా యాసిడ్ రిఫ్లక్స్‌ను అనుభవిస్తే మజ్జిగ తాగడం మెుదలుపెట్టండి. భోజనం తర్వాత గ్లాసు మజ్జిగ తాగితే జీర్ణక్రియకు హాయినిచ్చి ఎసిడిటీని తగ్గిస్తుంది. ఇందులో శొంఠి లేదా మిరియాలు వంటివి వేస్తే ప్రయోజనాలు పొందవచ్చు.

మలబద్ధకం, సంబంధిత సమస్యలను నివారించడంలో మజ్జిగ సహజమైన చికిత్స. దీనిలోని అధిక ఫైబర్ కంటెంట్ పేగు కదలికలకు సహాయపడుతుంది. శరీరాన్ని హైడ్రేట్​గా ఉంచడానికి మజ్జిగ సహాయం చేస్తుంది. హైడ్రేట్‌గా లేకుంటే.. డీహైడ్రేషన్ అనారోగ్య సమస్యలను, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అధిక ఎలక్ట్రోలైట్ కంటెంట్ కారణంగా మజ్జిగ శరీరంలో నీటిని కోల్పోకుండా ఆపుతుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 08 , 2024 | 01:44 PM