Share News

Almonds: బాదం నాణ్యతను ఎలా తెలుసుకుంటారు? ఈ చిట్కాలు ట్రైచేసి చూడండి..!

ABN , Publish Date - Jan 13 , 2024 | 01:12 PM

బాదం సాధారణంగా తీపి రుచితో ఉంటుంది. రుచిలో చేదు ఉన్నట్లయితే, బాదంపప్పు సరిగా లేదని అర్థం.

Almonds: బాదం నాణ్యతను ఎలా తెలుసుకుంటారు? ఈ చిట్కాలు ట్రైచేసి చూడండి..!
Almonds

మన ఇండ్లల్లో చాలావరకూ బలం కోసమనే కాదు.. బాదంపప్పులను తెగ వాడతారు. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనే కాదు. మెదడు తెలివితేటల్ని పెంచడంలోనూ బాదం పప్పు సహకరిస్తుంది. అయితే రోజూ తినే బాదంపప్పు స్వచ్చతను, నాణ్యతను ఎలా గుర్తించాలో మీకు తెలుసా.. బాదం నాణ్యతను ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు. అదెలా గంటే..

బాదం స్వచ్ఛతను, నాణ్యతను తనిఖీ చేయడానికి మొదటి పరీక్ష వాటి రూపాన్ని, రంగును, ఆకృతిని చూడటం. మంచి నాణ్యమైన బాదంపప్పులు చక్కని గోధుమరంగులో ఉండి, మచ్చలేని ఆకృతితో ఉంటాయి. రంగు మారడాన్ని గమనించినట్లయితే ఇది బాదంప్పులు ఎక్కువగా ముదురు రంగులో కనిపిస్తే, అది నాణ్యత సమస్యగా గుర్తించాలి.

బాదం సాధారణంగా తీపి రుచితో ఉంటుంది. రుచిలో చేదు ఉన్నట్లయితే, బాదంపప్పు సరిగా లేదని అర్థం. ఎందుకంటే ఇది బాదం బయటి పొరలో సహజమైన టాక్సిన్ అయిన ఫైటిక్ యాసిడ్ వంటి కొన్ని రసాయనాలుంటాయి, కాస్త బావున్న బాదం నాణ్యత కూడా కలిగి ఉందంటే అవి నాణ్యత లోపం ఉన్నవిగా గమనించాలి. ఇక కొన్ని మురికి వాసన వస్తే, అవి చెడిపోయినట్లు గమనించాలి.

బాదంపప్పులను ఒక గిన్నె నీటిలో ఉంచాలి. మంచి నాణ్యమైన బాదంపప్పులు నీటి దిగువకు మునిగిపోవాలి. అలా కాకుండా అవి తేలుతూ ఉంటే, పప్పు పాతవి లేదా చెడిపోయాయని గుర్తించాలి.

ఇది కూాడా చదవండి: రక్తపోటును ఎలా నియంత్రిస్తారు.. ఈ చిట్కాలతో తెలుసుకోండి..!


బాదంపప్పుల తాజాదనాన్ని కాపాడటానికి చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ ఉంచాలి.

గ్రౌండ్ , తరిగిన బాదంతో పోలిస్తే మొత్తం బాదంలో కల్తీ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. పేరున్న షాప్స్ నుంచి బాదం పప్పులను కొనుగోలు చేయాలి. అలాగే ట్యాంపరింగ్ లేదా డ్యామేజింగ్ ఉన్నాయేమో ప్యాకేజింగ్‌ను తనిఖీ చేయడం ముఖ్యం.

Updated Date - Jan 13 , 2024 | 01:12 PM