Share News

Ayurvedic : చలికాలంలో చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి..!

ABN , Publish Date - Feb 01 , 2024 | 04:10 PM

సహజ పదార్థాలతో తయారు చేసిన ఆయుర్వేద ఫేస్ మాస్క్‌లు చర్మానికి లోతైన పోషణను అందిస్తాయి.

Ayurvedic : చలికాలంలో చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి..!
Ayurvedic

చలికాలంలో చర్మం చల్లని వాతావరణానికి పొడిగా మారుతుంది., అలాగ పగుళ్లు, అరచేతులు, పాదాలు అనేక సమస్యలతో ఇబ్బందిగా మారతాయి. ఈ ఇబ్బందిని చాలామంది క్రీమ్స్ రాయడంతో సరిచేయచ్చు అనుకుంటారు కానీ ఇది కాలంతో పనిలేకుండా మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టవచ్చు. చర్మ నిగారింపును పెంచే విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవంటే..

చలికాలంలో..

ఈ సీజన్లలో వాతావరణంలో పొగమంచు, చల్లని గాలులు ఉంటాయి. ఇవి శరీరంలో వేడి పెరుగుదలకు కారణమైన వాత గుణాన్ని పెంచుతాయి. వేడిని శరీరంలో పెంచే ఆహారాలను తీసుకోవాలి. అలాగే చర్మ సౌందర్యాన్ని పెంచే విధంగా ఔషద నూనెలను ఉపయోగించడం కూడా పొడి చర్మాన్ని తగ్గించేందుకు సహాకరిస్తుంది.

హెర్బల్ ఫేస్ మాస్క్‌లు

సహజ పదార్థాలతో తయారు చేసిన ఆయుర్వేద ఫేస్ మాస్క్‌లు చర్మానికి లోతైన పోషణను అందిస్తాయి. తేనె, పెరుగు సమాన భాగాలను కలపి మాస్క్ వేసుకోవచ్చు. తేనె మాయిశ్చరైజింగ్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది, అయితే పెరుగు చర్మాన్ని ఉపశమనం చేస్తుంది. హైడ్రేట్ చేస్తుంది. ముఖం, మెడకు మాస్క్‌లా పూయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది., సుమారు 15-20 నిమిషాలు అలాగే ఉంచాలి, ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది తేమను తిరిగి నింపడానికి, మంటను తగ్గించడానికి, చర్మానికి ప్రకాశవంతమైన మెరుపును అందించడానికి సహాయపడుతుంది. చర్మ నిగారింపుకుపసుపు, గంధం, కలబంద వంటి ఇతర ఆయుర్వేద పదార్థాలను ఉపయోగించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.

ఇది కూడా చదవండి: వాటర్‌క్రెస్ తక్కువ కేలరీల ఆహారమే అయినా.. పోషకాలలో గొప్పది..!


ప్రతిరోజూ స్నానానికి ముందు గోరువెచ్చని నూనెను శరీరానికి అప్లై చేయడం వల్ల చర్మం మెరుపు, మృదుత్వం సమర్థవంతంగా పెరుగుతుంది. పొడిబారకుండా ఉంటుంది. నూనెను వేడినీటిలో వేసి 15 నుంచి 20 నిమిషాలు తర్వాత శరీరానికి మర్దనా చేసుకుని దాదాపు 45 నిమిషాలు ఉండాలి. చలికాలంలో నెయ్యి, వెన్న, పాలు వంటి లూబ్రికేషన్ పదార్థాలను తీసుకోవడం మంచిది. ముఖ్యంగా తీపి, పులుపు, ఉప్పు రుచులను సాధారణంగా అంతా ఇష్టపడతారు. బరువైన జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవడం కూడా చర్మ నిగారింపును తగ్గిస్తుంది. తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. చర్మం విషయంలోనూ ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. అరచేతులు పాదాలు పగుళ్లు ఎక్కువగా ఉంటే పాల మీగడను శరీరానికి పట్టించినా ఫలితం ఉంటుంది.

హెర్బల్ టీలతో హైడ్రేటెడ్‌గా..

ముఖ్యంగా చలికాలంలో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి హైడ్రేషన్ కీలకం. ఆయుర్వేదం లోపలి నుండి హైడ్రేటెడ్‌గా ఉండటానికి వార్మింగ్ హెర్బల్ టీలను సూచిస్తుంది. అల్లం, దాల్చినచెక్క, లికోరైస్ వంటి మూలికలతో చేసిన టీలను తీసుకోవచ్చు, ఇవి వెచ్చదనాన్ని అందించడమే కాకుండా యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ హెర్బల్ టీలు శరీరం నుండి టాక్సిన్స్‌ను బయటకు పంపి, ఆరోగ్యకరమైన చర్మాన్ని ఇస్తాయి. రోజంతా వెచ్చని నీటిని తీసుకోవడం, కెఫిన్, చక్కెర పానీయాలను తగ్గించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Feb 01 , 2024 | 04:10 PM