Share News

నెట్‌ స్కోర్‌తో పీహెచ్‌డీలో చేరొచ్చు

ABN , Publish Date - Mar 29 , 2024 | 06:39 AM

ఇకపై విద్యార్థులు యూనివర్సిటీల వారీగా పీహెచ్‌డీ అడ్మిషన్‌ పరీక్షలకు హాజరవ్వకుండా జాతీయ అర్హత పరీక్ష (నెట్‌) స్కోర్‌తో ప్రవేశాలు పొందవచ్చని

నెట్‌ స్కోర్‌తో పీహెచ్‌డీలో చేరొచ్చు

వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి: యూజీసీ

న్యూఢిల్లీ, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ఇకపై విద్యార్థులు యూనివర్సిటీల వారీగా పీహెచ్‌డీ అడ్మిషన్‌ పరీక్షలకు హాజరవ్వకుండా జాతీయ అర్హత పరీక్ష (నెట్‌) స్కోర్‌తో ప్రవేశాలు పొందవచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) గురువారం పేర్కొంది. ఈ ఏడాది జూన్‌ సెషన్‌లో నిర్వహించే యూజీసీ-నెట్‌ పరీక్షలో కొత్త కేటగిరీని ప్రవేశపెట్టనున్నట్లు తెలి పింది. వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుంది. గతంలో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషి్‌ప(జేఆర్‌ఎ్‌ఫ)-అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియామకానికి అర్హతకు మొదటి కేటగిరీ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియామకానికి అర్హతకు రెండో కేటగిరీలో నెట్‌ పరీక్షలు నిర్వహించేవారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా నియామకానికి నెట్‌ అర్హత జీవితకాలం చెల్లుబాటయ్యేది. తాజాగా పీహెచ్‌డీలో ప్రవేశాలకు అర్హతను చేర్చారు. దీంతో మొదటి కేటగిరీ కేవలం జేఆర్‌ఎఫ్‌ లేదా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా అర్హతకే పరిమితమౌతుంది. రెండో కేటగిరీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియామకానికి, పీహెచ్‌డీలో ప్రవేశానికి అర్హతగాఉంటుంది. కేవలం పీహెచ్‌డీ అర్హత కోసం మూడో కేటగిరీని పరిచయం చేశారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియామకానికి అర్హతలో మొదటి రెండు కేటగిరీలు జీవితకాలం చెల్లుబాటులో ఉంటాయి. పీహెచ్‌డీలో చేరేందుకు ఏడాది కాలపరిమితి ఉంటుంది. ‘‘వేర్వేరు వర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు విద్యార్థులు ఆయా విశ్వవిద్యాలయాలు నిర్వహించే ప్రవేశ పరీక్షలకు హాజరుకావాల్సి వచ్చేది. నెట్‌ను ప్రామాణికంగా తీసుకోవడం వల్ల ఆ ఇబ్బందులుండవు. ఏడాదిలో రెండుసార్లు నెట్‌ నిర్వహణ ఉంటుంది’’అని యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌కుమార్‌ తెలిపారు. తమ విశ్వవిద్యాలయంలో నెట్‌, జేఆర్‌ఎఫ్‌, తెలంగాణసెట్‌ను పీహెచ్‌డీ ప్రవేశాల్లో అర్హతగా పరిగణిస్తున్నామని, ఇవి లేనివారికి ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నట్టు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డీన్‌ డాక్టర్‌ వడ్డాణం శ్రీనివాసరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - Mar 29 , 2024 | 06:39 AM