Share News

సముద్రపు అడుగున కథ రాసిన దివ్యాంగుడు

ABN , Publish Date - Feb 17 , 2024 | 03:47 AM

సముద్రపు అడుగున కథ రాసి ఓ దివ్యాంగుడు రికార్డు నెలకొల్పాడు. తమిళనాడులోని రాణిపేట జిల్లా తిమిరి గ్రామానికి చెందిన దివ్యాంగుడు మణి ఎళిలన్‌ (45) సముద్రంలో ఈత శిక్షణ తీసుకున్నాడు.

సముద్రపు అడుగున కథ రాసిన దివ్యాంగుడు

చెన్నై, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): సముద్రపు అడుగున కథ రాసి ఓ దివ్యాంగుడు రికార్డు నెలకొల్పాడు. తమిళనాడులోని రాణిపేట జిల్లా తిమిరి గ్రామానికి చెందిన దివ్యాంగుడు మణి ఎళిలన్‌ (45) సముద్రంలో ఈత శిక్షణ తీసుకున్నాడు. బుధవారం అతను నీలాంగరై వద్ద 60 అడుగుల సముద్రం అడుగున.. నీటిలో వినియోగించే కలంతో కథ రాశాడు. ఆ కథను ఫోటోగా తీసి మొబైల్‌లో వాట్సాప్‌ ద్వారా మిత్రులకు పంపించాడు. సముద్రం పైభాగంలో ఉన్న మిత్రులు ప్రింట్‌ తీసి చిన్న హ్యాండ్‌ బుక్‌గా తయారుచేశారు. ఆ హ్యాండ్‌ బుక్‌ మణిఎళిలన్‌కు అందజేయగా ఆయన దానిని సముద్రంలో ఆవిష్కరించారు.

Updated Date - Feb 17 , 2024 | 07:31 AM