Share News

Viral: ఇదెక్కడి ఘోరం.. బస్సు రంధ్రం నుంచి కింద పడిపోయిన మహిళ.. అసలేం జరిగిందంటే..

ABN , Publish Date - Feb 06 , 2024 | 09:08 PM

చెన్నైలో ప్రభుత్వ బస్సు ఎక్కిన ఓ మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. బస్సు ఫ్లోర్‌కు రంధ్రం పడడంతో ఉన్న పళంగా కింద పడిపోయింది.

Viral: ఇదెక్కడి ఘోరం.. బస్సు రంధ్రం నుంచి కింద పడిపోయిన మహిళ.. అసలేం జరిగిందంటే..

చెన్నై (Chennai)లో ప్రభుత్వ బస్సు (Bus) ఎక్కిన ఓ మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. బస్సు ఫ్లోర్‌కు రంధ్రం (Hole on Bus floor) పడడంతో ఉన్న పళంగా కింద పడిపోయింది. తోటి ప్రయాణికులు వెంటనే గట్టిగా అరవడంతో డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బ్రేకులు వేశాడు. లేకపోతే ఆ మహిళ బస్సు చక్రాల కింద నలిగిపోయేది. చెన్నైలో జరిగిన ఈ ఘటన చాలా మందికి షాక్ కలిగిస్తోంది.

చెన్నైలో నివసిస్తున్న ఓ మహిళ వల్లలార్ నగర్ నుంచి తిరువెర్కాడు మధ్య నడిచే బస్సు ఎక్కి కూర్చుంది. దిగాల్సిన స్టాప్ రావడంతో సీటు నుంచి పైకి లేచింది. ఆ సమయంలో ఆమె నిల్చున్న చోట బస్సు ఫ్లోర్‌కు రంధ్రం పడింది. దీంతో ఆ మహిళ కిందకు పడిపోయింది. తోటి ప్రయాణికులు ఆమెను గట్టిగా పట్టుకుని కేకలు వేశారు. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బ్రేకులు వేశాడు. లేకపోతే ఆ మహిళ టైర్ల కింద పడి ప్రాణాలు కోల్పోయేది. స్వల్ప గాయాలు కావడంతో ఆ మహిళను సమీపంలోని ఆస్పత్రిలో జాయిన్ చేశారు. కాగా, ఈ ఘటనపై ప్రయాణికుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

బస్సు అంత అధ్వాన్నమైన పరిస్థితిలో ఉన్న విషయం కనీసం డ్రైవర్, కండక్టర్‌కు అయినా తెలియకపోతే ఎలా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై రవాణా అధికారులు వెంటనే స్పందించారు. ఆ ఘటనపై విచారణకు ఆదేశించారు. ప్రజా రవాణాను ప్రభుత్వం గాలికి వదిలేసిందంటూ ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు.

Updated Date - Feb 06 , 2024 | 09:08 PM