ప్రజాస్వామ్య ఖూనీని సహించబోం
ABN , Publish Date - Feb 06 , 2024 | 03:37 AM
చండీగఢ్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక నిర్వహించిన తీరుపై సోమవారం సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. గత నెల 30న జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికకు ఓటింగ్ హక్కు లేని నామినేటెడ్ సభ్యుడు అనిల్ మాసీ రిటర్నింగ్ అధికారిగా
అపహాస్యంగా చండీగఢ్ మేయర్ ఎన్నిక
ఆర్వోను ప్రాసిక్యూట్ చేయాలి: సుప్రీం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: చండీగఢ్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక నిర్వహించిన తీరుపై సోమవారం సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. గత నెల 30న జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికకు ఓటింగ్ హక్కు లేని నామినేటెడ్ సభ్యుడు అనిల్ మాసీ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉండగా, ఆప్-కాంగ్రెస్ కూటమికి 20 మంది సభ్యుల బలం ఉంది. ఆ కూటమిదే విజయమని అంతా భావించారు. కానీ, గుర్తులు సక్రమంగా లేకపోవడంతో ఆప్-కాంగ్రెస్ కూటమికి చెందిన ఎనిమిది ఓట్లు చెల్లవని రిట్నరింగ్ అధికారి ప్రకటించారు. దాంతో ఆ కూటమికి చెందిన కులదీ్‌పసింగ్‌కు 12 ఓట్లు, బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్‌కు 16 ఓట్లు వచ్చినట్టు తెలిపారు. బీజేపీ అభ్యర్థి విజయం సాధించినట్టు వెల్లడించారు. ఓట్లు చెల్లవని ప్రకటించి రిటర్నింగ్ అధికారి అక్రమాలకు పాల్పడ్డారని, అందువల్ల ఆ ఎన్నికను రద్దు చేయాలని ఓడిపోయిన ఆప్ కౌన్సిలర్ కులదీప్ సింగ్ తొలుత పంజాబ్-హరియాణా హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ తిరస్కరణ ఎదురుకావడంతో సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఎనిమిది ఓట్లను రద్దు చేసే విషయంలో రిటర్నింగ్ అధికారి ప్రవర్తించిన తీరును తప్పుపట్టింది. బ్యాలెట్ పేపర్లలో ఆయన మార్పులు చేసినట్టు కనిపిస్తోందని, ఆయనను ప్రాసిక్యూట్ చేయాల్సి ఉందని అభిప్రాయపడింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వీడియోను చూసిన ధర్మాసనం, బ్యాలెట్ పేపర్లపైన ఉన్న గుర్తులను ఆయన చెరిపివేస్తున్నట్టు గమనించింది. ఈ ఎన్నికలకు సంబంధించిన మొత్తం రికార్డులు, బ్యాలెట్ పేపర్లు, వీడియోగ్రఫీ, ఇతర పత్రాలన్నింటినీ అందజేయాలని అందజేయాలని పంజాబ్-హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది.