Share News

యూపీలో 17 ఎంపీ స్థానాలిస్తాం

ABN , Publish Date - Feb 20 , 2024 | 05:37 AM

విపక్ష ‘ఇండియా’ కూటమి భాగస్వాముల నడుమ దాగుడుమూతలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా యూపీలో కాంగ్రె్‌సతో సమాజ్‌వాదీ పార్టీ సీట్ల బేరాలు ఆడుతోంది.

యూపీలో 17 ఎంపీ స్థానాలిస్తాం

సరేనంటేనే రాహుల్‌ యాత్రకు అఖిలేశ్‌

సమాజ్‌వాదీ పార్టీ షరతు.. 11 సీట్లకు తమ అభ్యర్థుల ప్రకటన

లఖ్‌నవూ, ఫిబ్రవరి 19: విపక్ష ‘ఇండియా’ కూటమి భాగస్వాముల నడుమ దాగుడుమూతలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా యూపీలో కాంగ్రె్‌సతో సమాజ్‌వాదీ పార్టీ సీట్ల బేరాలు ఆడుతోంది. మొత్తం 80 ఎంపీ స్థానాలకు గాను గతంలో 11 సీట్లు మాత్రమే కాంగ్రె్‌సకు ఇస్తామని ప్రతిపాదించిన ఆ పార్టీ.. ఇప్పుడా సంఖ్యను 17కి పెంచింది. ఇదే తమ తుది నిర్ణయమని.. ఇందుకు అంగీకరిస్తేనే తమ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ మంగళవారం రాయ్‌బరేలీలో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీతో కలిసి ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’లో పాల్గొంటారని సమాజ్‌వాదీ ముఖ్య అధికార ప్రతినిధి రాజేంద్ర చౌధరి సోమవారమిక్కడ స్పష్టం చేశారు. అయితే కాంగ్రె్‌సకు ఏయే సీట్లు ఇవ్వనుందీ చెప్పేందుకు నిరాకరించారు. ఇదే సమయంలో 11 స్థానాలకు సమాజ్‌వాదీ తన అభ్యర్థులను ప్రకటించింది. గత నెల 30న 16 మంది అభ్యర్థులతో సమాజ్‌వాదీ తొలి జాబితా విడుదల చేసింది. అంటే ఇప్పటికి 27 మంది అభ్యర్థులను ప్రకటించినట్లయింది.

Updated Date - Feb 20 , 2024 | 07:56 AM