Share News

పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నాం

ABN , Publish Date - May 23 , 2024 | 05:45 AM

ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య తీవ్ర పోరు కొనసాగుతోన్న వేళ ఐరోపాలోని నార్వే, ఐర్లాండ్‌, స్పెయిన్‌ దేశాలు కీలక ప్రకటన చేశాయి. పాలస్తీనాను తాము

పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నాం

నార్వే, ఐర్లాండ్‌, స్పెయిన్‌ కీలక ప్రకటన

టెల్‌ అవీవ్‌(ఇజ్రాయెల్‌), మే 22: ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య తీవ్ర పోరు కొనసాగుతోన్న వేళ ఐరోపాలోని నార్వే, ఐర్లాండ్‌, స్పెయిన్‌ దేశాలు కీలక ప్రకటన చేశాయి. పాలస్తీనాను తాము ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్టు ప్రకటించాయి. పాలస్తీనా ప్రత్యేక దేశంగా ఉంటేనే ఆ ప్రాంతంలో శాంతిస్థాపన సాధ్యమని అభిప్రాయపడ్డాయి. నార్వే, ఐర్లాండ్‌, స్పెయిన్‌ చేసిన ప్రకటనను ఇజ్రాయెల్‌ తీవ్రంగా ఖండించింది. తమ నిరసనను తెలియజేసేందుకు ఆ దేశాల్లోని తమ రాయబారులను స్వదేశానికి రప్పించింది.

Updated Date - May 23 , 2024 | 07:26 AM