Share News

హమాస్‌.. మాకొద్దంటే వద్దు..!

ABN , Publish Date - Jan 11 , 2024 | 03:56 AM

ఇంతకాలం హమాస్‌ సర్కారుకు మద్దతుగా నిలిచిన గాజావాసుల్లో ఆ ఉగ్ర సంస్థపై విశ్వాసం సన్నగిల్లుతోంది. హమాస్‌ పాలన తమకు వద్దంటే వద్దని వారు తేల్చిచెబుతున్నారు.

హమాస్‌.. మాకొద్దంటే వద్దు..!

తేల్చి చెబుతున్న గాజా వాసులు.. అరబ్‌ బారోమీటర్‌ సర్వేలో వెల్లడి

ఇంతకాలం హమాస్‌ సర్కారుకు మద్దతుగా నిలిచిన గాజావాసుల్లో ఆ ఉగ్ర సంస్థపై విశ్వాసం సన్నగిల్లుతోంది. హమాస్‌ పాలన తమకు వద్దంటే వద్దని వారు తేల్చిచెబుతున్నారు. వెస్ట్‌బ్యాంక్‌, గాజా కేంద్రాలుగా పనిచేస్తున్న ‘అరబ్‌ బారోమీటర్‌’ అనే పరిశోధన సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అక్టోబరు 7 ఇజ్రాయెల్‌పై హమాస్‌ ముప్పేట దాడి జరిపినప్పుడు కూడా గాజా వాసుల అభిప్రాయాలను ఈ సంస్థ తెలుసుకుంది. అప్పట్లో హమాస్‌ దాడులను 72ు మంది గాజావాసులు సమర్థించారు. అయితే, ఇటీవల మరోమారు సర్వే నిర్వహించగా.. హమాస్‌ మద్దతుదారుల సంఖ్య44శాతానికి పడిపోయింది. గాజాలో ఇజ్రాయెల్‌ భూతల దాడులు ప్రారంభమయ్యాక.. పౌరులను హమాస్‌ పట్టించుకోకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

ఆపరేషన్‌ ‘అసె్‌సమెంట్‌ మిషన్‌’: బ్లింకన్‌

గాజా పౌరులను తిరిగి ఉత్తరాదికి తరలించేందుకు ఆపరేషన్‌ ‘అసె్‌సమెంట్‌ మిషన్‌’ను ప్రారంభిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఆపరేషన్‌ను ఐరాస నేతృత్వంలో చేపడతామన్నారు. పరిస్థితులు అనుకూలించిన వెంటనే.. గాజాలో అమెరికా రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, పౌరులు ఉత్తరాదికి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. గాజాలో శాంతి నెలకొనేలా అమెరికా చర్యలు తీసుకుంటోందని వివరించారు.

Updated Date - Jan 11 , 2024 | 03:56 AM