Share News

నీటి భద్రతకు జలవనరుల నిర్వహణ అథారిటీ

ABN , Publish Date - Nov 13 , 2024 | 05:46 AM

: గ్రామాల నుంచి నగరాల వరకు నీటి భద్రతకు ప్రణాళికలు, భూగర్భ జలాలు, ముంపు ప్రాంతాల నిర్వహణకు బాధ్యత వహించే ఏకీకృత జలవనరుల నిర్వహణ అథారిటీ (ఐడబ్ల్యూఆర్‌ఎం)

నీటి భద్రతకు జలవనరుల నిర్వహణ అథారిటీ

న్యూఢిల్లీ, నవంబరు 12: గ్రామాల నుంచి నగరాల వరకు నీటి భద్రతకు ప్రణాళికలు, భూగర్భ జలాలు, ముంపు ప్రాంతాల నిర్వహణకు బాధ్యత వహించే ఏకీకృత జలవనరుల నిర్వహణ అథారిటీ (ఐడబ్ల్యూఆర్‌ఎం) ఏర్పాటును ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా నమూనా బిల్లును రూపొందించింది. దీన్ని మంగళవారం అన్ని రాష్ట్రాలకూ పంపించింది. వికసిత్‌ భారత్‌ విజన్‌లో భాగంగా దేశంలో అందరికీ నీటి భద్రతను సాధించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఐడబ్ల్యూఆర్‌ఎంను ప్రతిపాదించిందని జలవనరుల శాఖ అదనపు కార్యదర్శి రాకేశ్‌ కుమార్‌ వర్మ తెలిపారు. ఇది ముంపు ప్రాంతాలను పర్యవేక్షిస్తుందని, నదీ పరిరక్షణ మండలాలను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 05:46 AM