Share News

ఆరు మెట్రో విమానాశ్రయాల్లో వార్‌ రూమ్స్‌

ABN , Publish Date - Jan 17 , 2024 | 03:52 AM

వాతావరణ సమస్యలతో విమానాల రాకపోకల ఆలస్యం నేపథ్యంలో పౌర విమానయాన శాఖ రంగంలోకి దిగింది. దే

ఆరు మెట్రో విమానాశ్రయాల్లో వార్‌ రూమ్స్‌

వాతావరణ సమస్యలతో విమానాల రాకపోకల ఆలస్యం నేపథ్యంలో పౌర విమానయాన శాఖ రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా ఆరు విమానాశ్రయాల్లో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి వార్‌ రూమ్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం తెలిపారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, బెంగళూరు, కొల్‌కతా, చెన్నై విమానాశ్రయాల్లో వార్‌ రూమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఎక్స్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ విమానాశ్రయంలోని కేటగిరీ 3లో ఉన్న ‘29ఎల్‌’ రన్‌వేను మంగళవారం నుంచి అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. తద్వారా లో విజిబిలిటీ పరిస్థితిలోనూ విమాన రాకపోకలు సాగించే వీలుంటుందన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 03:52 AM