Postal Ballot : గట్టెక్కించిన పోస్టల్ బ్యాలెట్
ABN , Publish Date - Jun 07 , 2024 | 05:34 AM
పోస్టల్ బ్యాలెట్ రూపంలో శివసేన (షిండే), బీజేపీలకు అదృష్టం వరించింది. ఈవీఎంల్లో తగిన మెజార్టీ రాకున్నా పోస్టల్ బ్యాలెట్ ద్వారా లభించిన ఓట్లతో చివరి నిమిషంలో విజయం సాధించాయి. ఉత్కంఠ

ఉద్యోగుల ఓట్లతో షిండే సేన, బీజేపీలకు దక్కిన సీట్లు
న్యూఢిల్లీ, జూన్ 6: పోస్టల్ బ్యాలెట్ రూపంలో శివసేన (షిండే), బీజేపీలకు అదృష్టం వరించింది. ఈవీఎంల్లో తగిన మెజార్టీ రాకున్నా పోస్టల్ బ్యాలెట్ ద్వారా లభించిన ఓట్లతో చివరి నిమిషంలో విజయం సాధించాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో మహారాష్ట్రలోని వాయువ్య ముంబయి నియోజకవర్గం నుంచి శివసేన (షిండే) అభ్యర్థి రవీంద్ర వైకర్ గెలుపొందారు. ఒడిశాలోని జాజ్‌పూర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన రబీంద్ర నారాయణ బెహరా కూడా ఇదే రీతిలో విజయం సాధించారు. 2019 వరకు తొలుత పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కింపును పూర్తి చేసిన తరువాతనే ఈవీఎంల ఓట్లు లెక్కించే వారు. ఈ విధానాన్ని మార్పు చేస్తూ 2019 మార్చి 18న ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్‌ను ఎప్పుడైనా లెక్కపెట్ట వచ్చని తెలిపింది. ఈ రెండు నియోజకవర్గాల్లో చివర్లో పోస్టల్ బ్యాలెట్లను కలపడంతో వాటి సాయంతో ఈ అభ్యర్థులు గట్టెక్కారు.