Share News

అమెరికా అధ్యక్ష రేసు నుంచి.. వివేక్‌ రామస్వామి అవుట్‌

ABN , Publish Date - Jan 17 , 2024 | 04:00 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడిన భారత సంతతి ప్రముఖుడు, పారిశ్రామికవేత్త వివేక్‌ రామస్వామి ఆ

అమెరికా అధ్యక్ష రేసు నుంచి.. వివేక్‌ రామస్వామి అవుట్‌

అయోవా కాకస్‌లో గెలిచిన డొనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు

వాషింగ్టన్‌, జనవరి 16: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడిన భారత సంతతి ప్రముఖుడు, పారిశ్రామికవేత్త వివేక్‌ రామస్వామి ఆ రేసు నుంచి వైదొలిగారు. సోమవారం అయోవా రాష్ట్ర కాకస్‌ ప్రైమరీ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గెలిచారు. ఆయన . 56,160 ఓట్లు (51%), 20మంది ప్రతినిధులను గెలుచుకున్నారు. వివేక్‌ 7.7% ఓట్లు, ముగ్గురు ప్రతినిధులను మాత్రమే సాధించారు. మరో అభ్యర్థి రాయ్‌ డిశాంటిస్‌ 21.2% ఓట్లతో 8 మంది ప్రతినిధులను, భారత సంతతికే చెందిన నికీ హేలీ 19.1 శాతం ఓట్లతో ఏడుగురు ప్రతినిధులను గెలుచుకున్నారు. తన అభ్యర్థిత్వాన్ని మెజారిటీ రిపబ్లికన్లు అంగీకరించకపోవడంతో.. రేసు నుంచి వైదొలగిన వివేక్‌.. ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు. ఒహాయో రాష్ట్రానికి చెందిన వివేక్‌.. తల్లిదండ్రులు కేరళ నుంచి అమెరికాకు వలసవచ్చారు. పారిశ్రామికవేత్త అయిన ఆయన రాజకీయ వర్గాల్లో ఎవరికీ పెద్దగా తెలియదు. 2023 ఫిబ్రవరిలో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వానికి బరిలో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించారు.

Updated Date - Jan 17 , 2024 | 04:00 AM