Share News

14లక్షల మంది ఇండియన్లకు యూఎస్‌ వీసాలు

ABN , Publish Date - Jan 30 , 2024 | 02:48 AM

అమెరికా గతేడాది (2023) భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలను జారీ చేసింది. దేశంలోని యూఎస్‌ ఎంబసీ, కాన్సులేట్‌లు అన్ని కేటగిరీలు కలిపి ఏకంగా 14 లక్షల వీసాలను జారీ చేశాయి. ఇందులో 1.40

14లక్షల మంది ఇండియన్లకు యూఎస్‌ వీసాలు

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): అమెరికా గతేడాది (2023) భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలను జారీ చేసింది. దేశంలోని యూఎస్‌ ఎంబసీ, కాన్సులేట్‌లు అన్ని కేటగిరీలు కలిపి ఏకంగా 14 లక్షల వీసాలను జారీ చేశాయి. ఇందులో 1.40 లక్షల విద్యార్థి వీసాలు ఉన్నాయి. ఇది ప్రపంచలోని ఏ దేశంలోనూ లేనంత ఎక్కువని.. వరుసగా మూడో ఏడాది కూడా ప్రపంచ రికార్డు నెలకొల్పామని యూఎస్‌ ఎంబసీ పేర్కొంది. 2022తో పోల్చితే వీసా దరఖాస్తుదారుల్లో 60ు పెరుగుదల నమోదైందని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మంది అమెరికా వీసా దరఖాస్తుదారుల్లో ఒకరు భారత్‌ నుంచే ఉన్నారని వివరించింది. ఉద్యోగ వీసాలకు కూడా అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని.. భారతీయులకు 3.80 లక్షల వీసాలు మంజూరు చేసినట్లు వివరించింది. గతేడాది రికార్డుస్థాయిలో వీసాల జారీ వెనక హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ కీలకపాత్ర పోషించిందని యూఎస్‌ ఎంబసీ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - Jan 30 , 2024 | 08:26 AM