Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

ప్రతి పట్టణంలో అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు

ABN , Publish Date - Mar 03 , 2024 | 05:00 AM

నేషనల్‌ అర్బన్‌ కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌యూసీఎ్‌ఫడీసీ)ను కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్‌ షా శనివారం

ప్రతి పట్టణంలో అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు

న్యూఢిల్లీ, మార్చి 2: నేషనల్‌ అర్బన్‌ కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌యూసీఎ్‌ఫడీసీ)ను కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్‌ షా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి పట్టణంలోనూ ఒక అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకును ఏర్పాటు చేయాలని ఎన్‌యూసీఎ్‌ఫడీసీకి లక్ష్యం నిర్దేశించారు. ఏటీఎం సదుపాయం, క్రెడిట్‌/డెబిట్‌ కార్డులు, క్లియరింగ్‌ వ్యవస్థ, స్టాచుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్‌ఎల్‌ఆర్‌) పరిమితి నిర్వహణ, రీఫైనాన్సింగ్‌ అందించేందుకుగాను అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులు వాటికవే అప్‌గ్రేడ్‌ కావాలని ఆయన చెప్పారు. 20 ఏళ్ల తర్వాత ఎన్‌యూసీఎ్‌ఫడీసీ ఏర్పాటైందని, ఇప్పుడిది ఎంతో అవసరమని తెలిపారు. దీనికి ఆర్బీఐ అనుమతి లభించడం సంతోషంగా ఉందని,చిన్న బ్యాంకులకు ఎన్‌యూసీఎ్‌ఫడీసీ సురక్షా కవచమని పేర్కొన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 06:25 AM