Share News

UPI Payments: యూపీఐ పేమెంట్స్‌కి అంతరాయం.. కారణం ఇదే!

ABN , Publish Date - Feb 06 , 2024 | 09:23 PM

దేశవ్యాప్తంగా మంగళవారం నాడు యూపీఐ సేవలకు అంతరాయం కలిగింది. యూజర్లు పేమెంట్స్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. ట్రాన్సాక్షన్స్ అవ్వలేదు. ఇందుకు కారణం.. బ్యాంక్ సర్వర్లు డౌన్ అవ్వడమే. అనేక బ్యాంక్ సర్వర్‌లు విస్తృతంగా అంతరాయాలను ఎదుర్కోవడం వల్లే.. యూపీఐ పేమెంట్స్ విఫలమయ్యాయి.

UPI Payments: యూపీఐ పేమెంట్స్‌కి అంతరాయం.. కారణం ఇదే!

దేశవ్యాప్తంగా మంగళవారం నాడు యూపీఐ సేవలకు అంతరాయం కలిగింది. యూజర్లు పేమెంట్స్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. ట్రాన్సాక్షన్స్ అవ్వలేదు. ఇందుకు కారణం.. బ్యాంక్ సర్వర్లు డౌన్ అవ్వడమే. అనేక బ్యాంక్ సర్వర్‌లు విస్తృతంగా అంతరాయాలను ఎదుర్కోవడం వల్లే.. యూపీఐ పేమెంట్స్ విఫలమయ్యాయి. Google Pay, PhonePe, BHIM, Paytm వంటి ప్రముఖ యాప్‌ల ద్వారా యూపీఐ చెల్లింపులు అవ్వకపోవడం వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. దీంతో.. నెటిజన్లు సోషల్ మీడియా మాధ్యమంగా గగ్గోలు పెడుతున్నారు. యూపీఐ పేమెంట్స్ విఫలమవుతున్నాయంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ముఖ్యంగా.. హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), కోటక్ మహీంద్రా బ్యాంక్‌, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకా ఇతర బ్యాంక్ యూజర్లు యూపీఐ చెల్లింపుల సమయంలో సర్వర్ సమస్యల్ని ఎదుర్కున్నట్టు పేర్కొన్నారు. తమ సంబంధిత బ్యాంకుల్లో ‘ఫండ్ ట్రాన్స్‌ఫర్’ ఫంక్షన్‌లతో ఇబ్బందులు ఎదుర్కున్నామని యూజర్లు ప్రత్యేకంగా పేర్కొన్నారు. అయితే.. ఇన్ని నివేదికలు వస్తున్నప్పటికీ అటు బ్యాంకులు గానీ, ఇటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నుంచి స్పందన లేదు. ఈ సమస్యకు, అలాగే యూజర్లు తమ బ్యాంక్ ఖాతాల ద్వారా UPI చెల్లింపులను ఎందుకు చేయలేకపోతున్నారనే వివరాల్ని అందించలేదు.

Updated Date - Feb 06 , 2024 | 09:23 PM