Share News

UP: దేశంలోనే నీటిపై తేలియాడే అతి పెద్ద స్క్రీన్.. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ తొలి ప్రదర్శన

ABN , Publish Date - Jan 14 , 2024 | 08:53 AM

దేశంలోనే నీటిపై తేలియాడే అతి పెద్ద స్క్రీన్ ని ఉత్తర ప్రదేశ్(UttarPradesh) ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. ఈ స్క్రీన్ పై అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమ విజువల్స్ ని ప్రదర్శించనున్నారు. యూపీ సీఎంఓ అధికారిక ప్రకటన ప్రకారం.. చౌదరి సింగ్ ఘాట్ లో దేశంలోనే అతి పెద్ద తేలియాడే స్క్రీన్ ను ప్రభుత్వం నిర్మిస్తోంది.

UP: దేశంలోనే నీటిపై తేలియాడే అతి పెద్ద స్క్రీన్.. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ తొలి ప్రదర్శన

అయోధ్య: దేశంలోనే నీటిపై తేలియాడే అతి పెద్ద స్క్రీన్ ని ఉత్తర ప్రదేశ్(UttarPradesh) ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. ఈ స్క్రీన్ పై అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమ విజువల్స్ ని ప్రదర్శించనున్నారు. యూపీ సీఎంఓ అధికారిక ప్రకటన ప్రకారం.. చౌదరి సింగ్ ఘాట్ లో దేశంలోనే అతి పెద్ద తేలియాడే స్క్రీన్ ను ప్రభుత్వం నిర్మిస్తోంది. దీనిని ఆర్తి ఘాట్ లో అమర్చుతారు. జనవరి 22న జరగనున్న అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఇందులో ప్రదర్శితం కానుంది.

ఫ్లోటింగ్ స్క్రీన్ సందర్శకులకు ప్రాణ-ప్రతిష్ఠను, ఆ తర్వాత జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించేందుకు వీలు కల్పిస్తుందని అధికారులు తెలిపారు. అయోధ్య ప్రాముఖ్యతను తెలియజేయడమే తమ ప్రధాన లక్ష్యమని అధికారులు వెల్లడించారు. ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ (IRS) పర్యవేక్షణలో 1800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నౌక నిర్మాణం జరుగుతోందని అధికారులు తెలిపారు.


స్క్రీన్ పరిమాణం 1,100 చదరపు అడుగులు ఉంటుందని చెప్పారు. నవంబర్‌లో ప్రారంభమైన ఫ్లోటింగ్ స్క్రీన్ నిర్మాణం రికార్డు సమయంలో పూర్తి అవుతోందని వెల్లడించారు. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన 60-70 మంది హస్తకళాకారులు జనవరి 19 నాటికి రికార్డు సమయంలో ఫ్లోటింగ్ స్క్రీన్‌ను నిర్మించడానికి కృషి చేసినట్లు వివరించారు. "ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ప్రకారం దీని నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం దీనిని బయోడీజిల్‌తో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాం. అయితే భవిష్యత్తులో సోలార్‌తో నిర్వహించాలనేది ప్రణాళిక. సరయు నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని స్క్రీన్ పరిధి కూడా పెరుగుతుంది" అని ఓ అధికారి వెల్లడించారు. ఫ్లోటింగ్ రెస్టారెంట్ ను కూడా నిర్మించే యోచనలో ఉన్నామని ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఎంఓయూపై సంతకాలు జరిగాయన్నారు.

Updated Date - Jan 14 , 2024 | 08:54 AM