కర్ణాటకలో ట్యాక్సీలకు ఏకరూప చార్జీల విధానం
ABN , Publish Date - Feb 06 , 2024 | 03:29 AM
కర్ణాటకలో ఓలా, ఉబెర్ తదితర ప్రైవేట్ ట్యాక్సీ సేవలకు, యాప్ ఆధారంగా పనిచేసే ట్యాక్సీలకు ఏకరూప చార్జీల విధానాన్ని
బెంగళూరు, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో ఓలా, ఉబెర్ తదితర ప్రైవేట్ ట్యాక్సీ సేవలకు, యాప్ ఆధారంగా పనిచేసే ట్యాక్సీలకు ఏకరూప చార్జీల విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి ఈవిషయాన్ని బెంగళూరులో ఆదివారం మీడియాకు తెలిపారు. ట్యాక్సీల నిర్వాహకులు వాతావరణం, రద్దీ సమయాలకు అనుగుణంగా చార్జీలు వసూలు చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.